గులాబి ముచ్చట్లు ;-సరళ రఘునాథ్;-కలం స్నేహం
మల్లె పరిమళం కన్న
గుబాళించే గులాబీలు ప్రేమకు చిహ్నాలై
ప్రేమికుల గుండెల్లో  
విరులై పూయును...
అవి పూసిన ఎదయే  నందనవనమై
వికసించును వెన్నెల వెలుగులు.....
ప్రేమకు చిహ్నమైన ఈ విరిని
 ప్రేయసికి అందించేటప్పుడు చూడాలి 
వారి  చురకత్తుల చూపులు... 
అమ్మో! అవి చూపులు కావు
మన్మధుడు వేసిన వలపుల బాణాల్లా
విరియును  వారి కళ్ళల్లో  కోటి కాంతులు........
పువ్వులలో మహారాణి తానేయై
రోజాల మకరందానికై 
సుమాల తో ముచ్చట ఆడుటకై
జుంటీగలు  తావి చుట్టూ 

గిరగిర తిరుగుతింటే
విరి తన కాడను వంచిపెట్టే ముచ్చట
ముద్దుగుమ్మలా  ముచ్చట్లు పెట్టే
జంట పక్షుల కిలకిల రావమే  తేనెటీగ నాదం....


కామెంట్‌లు
Unknown చెప్పారు…
Sooper
Unknown చెప్పారు…
Sooper
Sateesh చెప్పారు…
Adhbutamaina kavita..
Unknown చెప్పారు…
Good one
Unknown చెప్పారు…
Good one
అజ్ఞాత చెప్పారు…
Good one
అజ్ఞాత చెప్పారు…
Good one