*నూతన జీవనము* *(మణిపూసలు)*;-*మిట్టపల్లి పరశురాములు*
గతకాలముజీవనము
గడచిపోయెనువేగము
తెగులుతెరలుకమ్మి వేసి
మిగిలించెనుఖేదము

వాడ వాడ తిరిగింది
బుసలు కొట్టి నిలిచింది 
ఉపధ్రవములెన్నొదెచ్చి
కంట నీరు నింపింది

ఇల్లు గల్లి వదల లేదు
మనిషి మనిషి తేడలేదు
అలలతీరు పొంగిపొరలి
ధనిక పేద విడువ లేదు

కొత్త ఏడు వచ్చిందని
హంగులెన్నొతెచ్చునని
మరువబోకుసోదరా!
ప్రళయకాలమొచ్చునని

ముప్పుముంచుకొచ్చెనోయి
తప్పు తెలిసి మసలవోయి
జాగ్రత్తగనుండకున్న
కొంపమునిగిపోవునోయి

దుష్టకాలమొకటివచ్చె
ప్రళయాగ్నినికుమ్మరించె
ప్రాణవాయువందకుండ
ప్రజానీకమెంతొచచ్చె

కొత్త తెగులు వచ్చింది
నాలుకలను చాచింది
మాస్కులు ధరించకున్న
మాన కుండ మింగునది

నూతనసంవత్సరము
వచ్చెనెంతొ సంబరము
కలకాలమందరనమును
జీవనముసాగిద్దాము
            ***


కామెంట్‌లు