*ఆది మహిళా గురువు*;-*మిట్టపల్లి పరశురాములు*
   *తె.గీ*             
ఆదిమహిళలగురువు-అవనియందు
జ్ఞానజ్యోతియైవెలిగెను-జ్ఞానవతిగ 
బడుగుబలహీనబతుకుల-బాగుజేయ 
విద్యనందజేయనిలచెను-వినయముగను
*తే.గీ*
మూఢనమ్మకాలముసుగులో-మునిగియున్న 
సంఘమునుతట్టిలేపెను-సత్వరముగ
మహిళచదవగమేలని-మహినితలచి
చదువునేర్పినసావిత్రి-సతతముగను
వేగు చుక్కలావెలిగెను-వేల్పుతీరు
*తే.గీ*
సంఘసేవనేలక్ష్యమ్ము-సత్యమనియు
వాడవాడలయందున-వరసగాను
బడులనెన్నియోనెలకొల్పి-పట్టుబట్టి
చదువునేర్పెను స్త్రీలకు-చక్కగాను
*ఆ.వె*
దీన జనులతల్లి- ధీరవనితగను
పేరుపొందినిలిచె- పేర్మిమీర
ఈసడింపులెన్నొ-ఈప్సితముగపొంది
వెలుగుపథమునిలిపి-వెతలుబాపె
*ఆ.వె*
అణచబడ్డవారి-నాదుకొనగతాను
కంకణమ్ముకట్టి-కదలిముందు
చదువునేర్పిముదము-సావిత్రి పూలెనే
నిలిచి పోయివెలిగె-నింగిలోన
                  ***

కామెంట్‌లు