బ్రతుకు బాట * అసమర్ధ జీవయాత్ర *కోరాడ నరసిం హా రావు*

 *  63  ***
ఇంట్లో వాళ్ళు,వీధిలోవాళ్ళు... చుట్టాలు, స్నేహితులుఅందరూ అనుకుంటున్నట్లు...నాది  అజ్ఞా నమో...అవివేకమో...అసమర్ధతో...మొదటినుండి మనసులో పేరుకుపోయిన ఆత్మన్యూనతా
భావం !లౌకిక వ్యవహార సామర్ధ్యం పూర్తిగా కొరవడింది అనేది సత్యం !అందుకే నా జీవి తం ఓ అసమర్ధుని జీవయాత్ర లా సాగుతోంది...! దిన - దిన   గండం... నూరేళ్లాయుష్షు...!
(47) నలభై ఏడేళ్ల వయసులో 
మళ్ళీ... రేపెలాబ్రతకాలి అనే... 
సమాధానం దొరకని ప్రశ్న... !!
ఏం చెయ్యాలో... ఎలా బ్రతకాలో అర్ధం కాని సందిగ్ధం!
 స్టూడియో వదిలేసి... అప్పుడే మూడునెలలుగడిచిపోతున్నై!
వైజాగ్ లో ఫోటోగ్రఫీ తప్ప ఇంకేదైనా పని... నెలకు కనీసం పదిహేనువందలుజీతమిచ్చేదేదైనా చూసుకోవాలని విశాఖ పట్నం  వెలిపొటానికి సిద్ధ పడుతున్న సమయంలో... 
మా హిందీ మాష్టారు మాఇంటి  కొచ్చారు !..." నరసింహారావు నువ్విప్పుడు ఖాళీగా  ఉన్నావు కదా...మన కాలేజ్ లో క్లర్క్ పోస్ట్ ఖాళీగా ఉంది ఇంతవరకూ ఆ వర్క్ అంతా మా చిన్నళ్లుడే  చూస్తున్నాడు అతను  ఇంకో చోట ఉద్యోగానికి వెలిపోతున్నాడు !
ఇంట్లో అందరూ నువ్వ యితేనే 
బాగుంటుందన్నారు... నీకు నచ్చితే రేపే వచ్చి జాయిన్ అయిపో... !" అన్నారు. 
మా హిందీమాష్టారు... !వెనకా ముందూ... వెన్నూ -  దన్నూ ఏమీ లేకపోయినా... స్వశక్తితో 
స్వయంకృషితో...అతిసామాన్య జీవితాన్ని అత్యున్నత స్థితికిచేర్చినసామర్ధ్యం అతనిది
నేను ఉమాస్టూడియోలో పనిచేస్తున్న రోజులలో మాష్టారు ఊరికి ఆ చివరనున్న బెలగాం నుండి... ఈచివర నాలుగుమైళ్ళ దూరంలో... ఉన్న స్కూల్ కి రోజూ ఓ పాత సైకిల్ మీదవచ్చి,వెళుతుండే వారు...!
నేను సొంతంగా స్టూడియో పెట్టిన రోజుల్లో... అదే స్కూల్ కి... పాత సెకండ్ హ్యాండ్ లూనా మీద  వెళ్లివస్తుండేవారు
ఆబండిమధ్యలోఆగిపోతుండేది... దాన్ని మాస్టూడియో వరకూ తోసుకుంటూ వచ్చి... స్టూడియో దగ్గర బండిని ఉంచేసి తరువాత రిపేర్ చేయించి పట్టుకెళ్ళేవారు !
ఆయన హిందీ ప్రచార సభ హైదరాబాద్ తరపున అన్నాళ్లూ చేసినసేవ, ప్రచారాలను గుర్తించి సభవారు
హిందీ పండిట్ ట్రైనింగ్ కాలేజ్ ని జిల్లామొత్తంలో మాష్టారికే అవకాశం ఇచ్చారు.. !
ఆ కాలేజ్ తో... మాష్టారి దస తిరిగిపోయింది !    
డబ్బు, పేరు, హోదా... మాష్టారి తీరుతెన్నులే పూర్తిగా  మారి పోయాయి! 
 లైన్స్ క్లబ్ లో... సెక్రెటరీ, ప్రెసిడెంట్ పదవులు !వాణీ గానసభలో క్రియాశీలక సభ్యులు !సొంతంగా... సాహితీలహరి సాహిత్యసంస్థ స్థాపన, నిర్వహణ... !!
అందరితోనూ సత్సంబంధాలు!
పచ్చకామెర్ల వైద్యునిగా మంచి పేరు... రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా పురష్కారం అక్కడినుండి ఎన్నెన్నో సన్మానాలు, సత్కారాలు... మహారాజయోగం తో... మంచి ఉచ్చ స్థితిలో ఉన్నారు మాష్టారు !
మాష్టారే వచ్చి కోరి ఉద్యోగమిస్తాననటంతో... ఆతనికి నాపై గల ప్రేమ, ఆదరాభిమానాలకు పరవశించిపోతూ... మరుసటిరోజే కాలేజీకి బయలుదేరాను !
నా బ్రతుకు బాటలో మూడో మజిలీ మొదలవుతోంది... !!
     ******
  .......    సశేషం    .......
కామెంట్‌లు