గీతాంజలి ; -రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు


 60.సాగర తీరాన చిన్నారులుభూగోళంమీద మూడొంతులు నీరు, ఒకవంతు నేల వుంది - దీన్ని ఆధారం చేసుకుని ప్రపంచం అంతా సముద్రం ఒడ్డున నివసిస్తున్నట్టు కవితాత్మక వర్ణన. అనంత విశ్వసాగర తీరాన చిట్టి చిన్నారుల కలయిక. సముద్రానికి, జీవకోటికి వున్న సంబంధాలు మధురమైన తల్లి ఒడిలా అలల కదలికలు పిల్లలకు లాలి పాటల తరంగాలు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కెరటాలు నవ్వుల నురగలు పిల్లలతో ఆడుకుంటున్నాయి అంటూ వర్ణించారు. అనంతమైన ప్రకృతి ముందు ప్రజలను పసివాళ్ళుగా, వాళ్ళు నిర్మించుకుంటున్న నగరాలను ఇసుకతో కట్టిన బొమ్మరిళ్ళు, సముద్రం మీద నడిచే ఓడలు , పడవలు తాటాకు పడవలు. అనంత సాగరానికి, మనుషులకు మధ్య నడిచే జీవన పోరాటం పసివాళ్ళ క్రీడా వినోదం అంటూ వర్ణన.


 


కామెంట్‌లు