*మానశౌర్య పద్ధతి*
ఉత్పలమాల:
*గ్రాసము లేక స్రుక్కిన జ రాకృశమైన విశీర్ణమైనసా*
*యాసమునైన నష్టరుచి యైనను బ్రాణభయార్తమైనని*
*స్త్రాసమదేభకుంభపిశి తగ్రహలాలసశీలసాగ్రహా*
*గ్రేసరభాసమాన మగు కేసరి జీర్ణతృణంబు మేయునే?*
*తా:*
తినడానికి ఏమీ లేక బక్క చిక్కి పోయివున్నా, ముసలితనము చేత వంగిపోయినా, శక్తి లేకపోయినా, మాటి మాటికి ఆయాసము వస్తున్నా, నోటికి రుచి తెలియకపోయినా, శరీరములో వున్న ప్రాణము పోతుందేమో అనే భయము వున్నా, మందించినబేనుగు కుంభస్తలమందు వున్న మాంసపు ముద్ద తినడానికి అలవాటు పడ్డ సీంహము ఎండిన గడ్డి పోచ వైపు చూడనైనా చూడదు కదా!...... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*"ఆ కుటుంబం బాగా బ్రతికి చెడ్డది" అనే నానుడి మనం వింటూనే వుంటాము. సత్కర్ములు చేస్తూ, సద్బుద్ధితో నలుగురికి మంచి చేయాలి అని ఆలోచిస్తూ జీవనం గడిపిన వారు కాలక్రమేణా వారి ఐశ్వర్యాలు కరగి పోయినా వేరే వారి ఎదుట చేయి చాచడానికి ఇష్ట పడరు. ఎంత ప్రాణాంతకమైన పరిస్థితులు వచ్చినా మన ఆభిజాత్యాన్ని, ఆత్మగౌరవాన్ని వదులుకోవడం ఎప్పుడూ మంచిది కాదు. మన వ్యక్తిత్వాన్ని ఒకరి దగ్గర తాకట్టు పెట్టి ఎదగ వలసిన అవసరం ఎవరికీ ఎప్పుడూ రాకూడదు. .....*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి