*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౨౪- 024)*
 *మానశౌర్య పద్ధతి*
ఉత్పలమాల:
*వాలముఁద్రిప్పు నేలఁబడి వక్త్రముఁ గుక్షియుఁజూపుఁగ్రిందటం*
*గాలిడుంద్రవ్వుఁబిండదుని కట్టెదటన్ శునకంబు భద్రశుం*
*డాలము శాలితండులగు డంబులు చాటువచశ్శతంబుచే*
*నోలి భుజించు ధైర్యగుణ యుక్తిగఁజూచు మహోన్నతస్థితిన్*
*తా:*
ఆకలితో వున్న కుక్క, తనకు అన్నము పెట్టే వారి వైపు చూస్తూ తనకి ఆకలి గా వుంది అని చెప్పడానికి, కిందపడి దొర్లుతూ తన కాలితో తన నోరు పొట్ట చూపిస్తూ అన్నము పెట్టమని దీనంగా అడుగుతుంది. కానీ ఒక మదగజం మాత్రము తనకు ఎంత ఆకలిగా వున్నా, మావటి వాడు వచ్చి చక్కటి కబర్లు చెపుతూ పెట్టే గోరు ముద్దలు తినడానికి ఇష్టపడుతుంది, కానీ వెకిలి వేషాలు వేయదు...... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*మానవులు తమ అవసరాలు తీర్చుకునేందుకు పరమాత్మ చూపిన ధర్మపద్ధతిని పాటించి సమాజంలో చక్కగా జీవితం సాగించవచ్చు. కానీ, అలవిమీరిన, తనకు తగని కోరికలు తీర్చుకునేందుకు వెర్రి మొర్రి వేషాలు వేసి అయినా సాధించాలి అనుకోవడం అసంబద్ధమైన ఆలోచన. పరమేశ్వరుడు కూడా అంగీకరించడు.  కానీ, బుద్ధిమంతులు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత కరిగిపోయే పరిస్థితులు ఎదురైనా ఎటువంటి అసంబద్ధమైన పద్ధతి అవలంభిచరు. పరాత్పరుని పాదాలు వదలకుండా, అతనిలో నిశ్చలమైన, స్థిరమైన నమ్మకాన్ని వుంచి ముందుకు సాగుతారు. ఆ దేవదేవుని ఆశీర్వాదం తో ఆయన సాన్నిహిత్యాన్ని సాధించుకుంటారు......*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు