లింగ రూపుడే శివుడు"శంకర ప్రియ.," శీల., సంచార వాణి: 99127 67098
 👌ఆద్యంతములు లేని
     లింగ రూపుడు శివుడు!
     బిందు నాదాత్మకుడు!
              ఓ తెలుగు బాల!
        ( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ., )
👌శివుడు.. మహా లింగోద్భవుడు! పరంజ్యోతి స్వరూపుడు! ఆద్యoత రహితుడు! బిందు నాదాత్మకుడు!
👌లింగము.. ఈ చరాచర ప్రపంచమునకు సంకేతము! చైతన్య స్వరూపమైనది! బిందు నాదాత్మక మైనది! ఆద్యంతములు లేనిది!
👌సాంబ శివుడే  జ్యోతిర్లింగ రూపుడు! శివ శక్త్యాత్మక మైన మహాలింగ మూర్తియే మహాదేవుడు, శివుడు!
⚜️ శివలింగ దండకం⚜️
        జయ జయ శివ లింగ! లింగాది మధ్యాంత శూన్య స్వరూపాభిధా లింగ! ఖట్వాంగ! లింగాహి లింగాభ్ర గంగాసరి ల్లింగ! సారంగ! లింగాత్మభూ లింగ! ఐం లింగ! ఈం లింగ! ఓం లింగ! వృక్షాపరోక్ష విరూపాక్ష లింగా! నమస్తే! నమస్తే! నమః !!
( శ్రీ శివలింగ గద్యము., ఈ శ్వరార్చనా కళా శీలుడు., )

కామెంట్‌లు