కా మే శ్వ రు డు"శంకర ప్రియ.," శీల.,సంచారవాణి: 99127 67098
 👌కామేశ్వరుడ వీవె!
     కామ హరుడవు నీవె!
     కామితార్ధ ఫలప్రద!
              శ్రీ సాంబ! సదాశివ!
        ( శ్రీ సాంబ సదాశివ పదాలు., శంకర ప్రియ.,)
👌పరమేశ్వరుడు.. కామితార్ధ ఫల  ప్రదాత! ఐశ్వర్య యుక్తుడు. కనుక,  "కామేశ్వరుడు"! శ్రీ స్వామివారు.. భక్తులకు, జ్ఞానులకు.. ఇష్ట కామ్యములను నెరవేర్చుట యందు "కల్ప వృక్షము" వంటివాడు.. కామేశ్వరీ ధవుడు!
👌 కాముడైన మన్మధుని దహించిన వాడు.. "కామ హరుడు"! కోరికలు లేని వైరాగ్య వంతుడు.. "కామాతీతుడు"! దేవతలలో అగ్రగణ్యుడు. కనుక, "దేవ గ్రామణి"యగు; త్రిశూల పాణి, సాంబ శివుడు! అటువంటి పరమేశ్వరుని ఆశ్రయించి, త్రికరణ శుద్ధిగా సేవించాలి!
 ⚜️ కంద పద్యము ⚜️
  🙏కామేశ్వరు నీశ్వరునిన్,
       కామితార్ధ ఫలదాన కల్పకము, కామ రిపున్;
        కామాతీతుని, దేవ
       గ్రామణి! నిను నాశ్రయింతు! గౌరీ రమణా!
        ( "ఈశ్వరార్చనా కళాశీలుడు" శ్రీనాధ మహాకవి, విరచితమైన,  శ్రీ భీమ ఖండము... పంచమాశ్వాసము.. 137వ పద్యము.,)

కామెంట్‌లు