అ ర్ధ నా రీ శ్వ రు డు;"శంకర ప్రియ.," శీల.,సంచారవాణి: 99127 67098
 👌అల శ్వేత పింగళుడు
     అర్ధేoదు శేఖరుడు
      అర్ధ నారీశ్వరుడు
              ఓ తెలుగు బాల!
👌అర్ధ నారీశ్వరుడు
      భోగమోక్ష ప్రదుడు
      భక్తప్రియుడు భవుఁడు
                ఓ తెలుగు బాల!
        ( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ.,)
👌పరమ శివుడు.. అర్ధ నారీశ్వరుడు! తన దివ్య దేహములో వామభాగమును పార్వతీదేవికి అనుగ్రహించాడు, శివాకాంతుడు! శిరస్సునందు భూషణముగా అర్ధ చంద్రరేఖను ధరించాడు, రాజ శేఖరుడు!
👌పరమేశ్వరుడు.. ఆదిభిక్షువు! భక్త మహాశయుల నుండి.. "భక్తి భిక్ష"ను స్వీకరించి; వారికి "ముక్తి ధామము" నొసంగు చున్నాడు! భక్త వత్సలుడు, సాంబ శివుడు!
 ⚜️ కంద పద్యము ⚜️
  🙏అర్ధ కపాలము కేలను,
       అర్ధ నిశా సార్వభౌము డౌదల, నెడమన్
         అర్ధాంగ లక్ష్మి గౌరియు,
       వర్ధిల్లగా నొప్పు, భక్త వత్సలు కొలుతున్!
       ( ఔదలన్ = తల మీద, చంద్రుడు; అర్ధాంగ లక్ష్మి = సగము శరీరమును ఆశ్రయించిన సంపన్నురాలు, పార్వతీ దేవి.,)
        ( "ఈశ్వరార్చనా కళాశీలుడు" శ్రీనాధ మహాకవి, విరచితమైన,  శ్రీ భీమ ఖండము... పంచమాశ్వాసము.. 130వ పద్యము.,)

కామెంట్‌లు