ముత్యాల హారాలు;--గద్వాల సోమన్న,గణితోపాధ్యాయుడు.
అయ్య సంతకు వెళ్ళాడు
కొయ్య బొమ్మలు తెచ్చాడు
ఉయ్యాలో పాపకు మా
భయ్యా! చూపి ఆడించాడు

పొయ్యి పై పాలు పొంగాయి
చెయ్యిపై రాళ్ళ దొర్లాయి
నెయ్యితో  లడ్డులు  రుచి రుచి!!
నుయ్యిలో నీరు తీపి తీపి!!

బాల్యమెంతో గొప్పది, అ
మూల్యమైనది! ఇల స్వర్గ
తుల్యమది!బహు భాగ్యమది
కళ్యాణంలా  గొప్పది

సత్యాలు పిల్లల నోట
ముత్యాలై రాలుతాయి
నిత్యమూ మానవులకది
భత్యం!భవితవ్యమది!!


కామెంట్‌లు