శీర్షిక: నీటి చుక్క;--లతా శ్రీ
 చిటపట చిటపట చినుకుల చిందులు
చినుకు చినుకు కలిసి ముత్యమై
మెరియు చిగురాకు చివరన
చివరన చేరిన నీటి బొట్టు
చటుక్కున చేరి వాగున
ప్రవహించు శిల్ప సుందరిలా
వాగువంక నిండిన నాడు 
పైరు పంటలు పచ్చగా నుండును 
రవి వేడికి కలతచెంది 
నీరు ఆవిరి రూపాన నింగికి ఎగిసి 
మారును మేఘంలా పచ్చని చెట్టు 
చల్లని పలకరింపుతో పులకరించి 
తిరిగి వర్షించిన వానచినుకును 
ముద్దాడు పుడమి మురిపెంగా
 నేడు ఆ పుడమి ఉష్ణ తలము అయి
 నీటి చుక్కను చేస్తోంది మటుమాయం
 తరచి చూడ ఇది మానవ తప్పిదం 
ఒడిసిపట్టు నీటి చుక్కను
 దూరముండు పాలిథిన్ కవరు లకు 
తరిమి వేయు కాలుష్యభూతాలను
 వారధిగా నిలచి పో భావితరానికి అందించు
 నీటిని ప్రకృతివరంగా రేపటి తరానికి జీవధారగా
సి.హేమలత 

కామెంట్‌లు