అమ్మచెంతనబాల్యం
బరువంతా అమ్మదే
అంతాఅమ్మే చూసుకుంటది
ఎంత భరోసా అమ్ముంటే
అంతా ఆనందమే
ఎంత అదృష్టమో
ఎంతసంతోషమో
అమ్మ పక్కన వుంటే
ఇప్పుడు తెలుస్తుంది అమ్మ విలువ
లేని అమ్మకై అమ్మా అమ్మా అని
మనసు పిలుస్తుంటే
హృదయం నిండా ఒకబాధ
కోల్పోయిన అమ్మచెంతన
మెదిలిన నా జ్ఞాపకాలు
చెప్పుకునేందుకు అమ్మలేదు
కాని నామదినిండా అమ్మ రూపమే
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి