నందనవనం;-వెంకటేశ్వర్లు లింగుట్లతిరుపతి.;-కలంస్నేహం
ఇరుచక్రాలపై నడిపే సంసారం
భార్యాభర్తలు గడిపే పచ్చనికాపురం
ఒకరినొకరు కష్టసుఖాల్ని పంచుకుంటూ
పిల్లాపాపలతో సజావుగా సాగే
కుటుంబమై జీవితాంతం తోడూనీడై...

ఇంటి ఇల్లాలు ఒద్దికగా చక్కదిద్దే
మంత్రి చాతుర్యం ప్రదర్శిస్తూ
ఇల్లంతా నందనవనంగా మార్చి
కలతలెరుగని కాపురాన్ని గుట్టుగా
కాపాడే ఇలవేలుపై అలరించేను..

ఆడపిల్లలైతేనేం ఆదిలక్ష్మి దశతో
అణుకువతో మెలిగే ఆనందనిలయంగా
తీర్చిదిద్దే అనురాగానికి మారుపేరుగా
చదువుసంధ్యలలో మిన్నగా
ఆటపాటలతో ముందంజలో మసలే
మాణిక్యాలుగా ప్రతిష్టను నిలిపే భాగ్యదేవతలై...

అమ్మానాన్నల కనుసన్నల్లో మెలగుతూ
మంచి అలవాట్లును నేర్చుకొని 
వారి పరువును పెంచే ఆణిముత్యాలై
తమ నైపుణ్యంతో వృద్ధిలోకి వచ్చే 
అమ్మాయిలు అపరచాణక్యులుగా....

అలుపెరగని తల్లితండ్రులు బాధ్యత
పిల్లలను క్రమశిక్షణతో పెంచి పెద్దచేసి
వారు కోరుకొనే జీవితానికి భరోసానిస్తే చాలునే....


కామెంట్‌లు