మాట్లాడనివ్వండి !!?; -సునీతా ప్రతాప్ ఉపాధ్యాయినీ p.s. నంది వడ్డెమాన్ నాగర్ కర్నూలు జిల్లా.
విద్యార్థుల్ని మాట్లాడనివ్వాలి!!
తరగతి గదుల్లో సభల్లో
సమావేశాల్లో మాట్లాడనివ్వాలి !!

ఆలోచనలు క్రమపద్ధతిలో లేకపోవడం వలన
ఆలోచనలు రాకపోవడం వలన
విద్యార్థులు మాట్లాడలేరు !?

ఆంజయిటీవలన-భయం వలన
న్యూనత భావం వలన
విద్యార్థులు మాట్లాడలేరు !!?
అందుకే
విద్యార్థుల్ని మాట్లాడనివ్వాలి!!

ఇంట్లో తల్లిదండ్రులతో
అక్క చెల్లి తో మాట్లాడినట్లు
బయట స్నేహితులతో మాట్లాడినట్లు
బడిలో తరగతి గదిలో
వాళ్లతో వాళ్లే మాట్లాడుతున్నట్లు

మాట్లాడానికి ఏమీ లేకపోయినా మాట్లాడినట్లు
విద్యార్థుల్ని మాట్లాడనివ్వాలి !!?

సంతోషంతో ఉత్సాహంతో
ఉల్లాసంతో మాట్లాడినట్లు
చివరికి తనతో తానే మాట్లాడినట్లు
ఉపాధ్యాయులతో ఊరి వాళ్ళ తో కూడా
మాట్లాడేటట్లు
విద్యార్థుల్ని మాట్లాడనివ్వాలి!!?

నిల్చోని మాట్లాడ లేక పోతే
కూర్చొని మాట్లాడనివ్వాలి!!?

మాట్లాడడం ఒక శిక్షణ కాదు
మాట్లాడడం ఒక అలవాటు
మాట్లాడడం ఒక శాస్త్రం కాదు
మాట్లాడడం ఒక సూత్రం!!!?

మాట్లాడడం ఒక పనిముట్టు లాంటిది
దాన్ని వాడడం నేర్పాలి!?
మాట్లాడటం నేర్చుకుంటే రాదు
మాట్లాడుతూ పోతే వస్తుంది!?

మాట్లాడడం ఒక గొప్ప అలవాటు
అలవాటు చేసుకోండి 
భయం ఆంజయిటీ,-న్యూనతాభావం
పోతుంది
విద్యార్థుల్ని మాట్లాడనివ్వండి !!?

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గొప్ప వక్త మీనా కుమారి గారి స్మృతిలో 
సునీతా ప్రతాప్-8309529273

కామెంట్‌లు