పుస్తకం!!;-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయినీ P.S. నంధీవడ్డెమాన్.నాగర్ కర్నూలు జిల్లా
మనసుపెట్టి చదివితే
పుస్తకం రంగు రంగుల ఇంద్ర ధనుస్సు!!

తల ఎత్తి పుస్తకం వైపు చూస్తే
ఆకాశమంత వింతవింత అక్షర నక్షత్రాలు!!

పుస్తకం విప్పి చూసిన
కళ్ళు విప్పి చూసిన ఒకటే!!

రెండు కళ్లు రెండు కాళ్లు రెండు చేతులు
కానీ కుడి ఎడమలు
ఆ రెంటినీ కలిపేది పుస్తకం ఒకటే!!?

పుస్తకాలు పిల్లలకు
రంగు రంగుల సీతాకోక చిలుకలు
పుస్తకాలు యువకులకు
రహస్యాలను విప్పి చెప్పే రహస్య ప్రేమికురాలు
పుస్తకాలు వృద్ధులకు
జ్ఞాపకాల అద్దాలు విజ్ఞాన కళ్ళద్దాలు!!!

పుస్తకాలు వస్తువులు కావు
సమస్త లోకాలను తిప్పే
రెండు రెక్కల పక్షులు !!!?

పుస్తకాలు
యుగయుగాల ఆడా మగా లు!!

పుస్తకాలను నీవు ప్రేమిస్తే
ఎంతో ఆస్తి అందమైన ప్రేయసి !!

నిన్ను ఉరికొయ్య నుంచి విడిపించేది
ఆత్మహత్య నుంచి హత్య నుంచి తప్పించేదీ
పుస్తకం ఒకటే!!?

పూలు మొక్కలకు మొలకలకు పూస్తాయి
పుస్తకాలు తలకాయ లకు కాస్తాయి!!?

నీవు సముద్రంలో పడితే
పుస్తకాలు చేపల మొప్పలవుతావి!!?

మనుషులకు పుట్టినవీ పుస్తకాలు
పుస్తకాలకు పుట్టినవి
విజ్ఞాన శాస్త్రాలు శాస్త్ర సాంకేతిక శాస్త్రాలు!!

పుస్తకాలను కనండి
పెంచి పోషించడం డి !!?

Sunita pratap teacher PS Nandi waddeman Nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు