*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౩౧- 031)*
 *మానశౌర్య పద్ధతి*
కందం:
*విదిలింప నురుకు సింగపుఁ*
*గొదమయు మదమలినగండ కుంజరములపై*
*నిది బలశాలికి నైజము*
*గద తేజోనిధికి వయసు కారణమగునే.*
*తా:*
సింహపు పిల్ల ఎంత చిన్నదైనా సహజంగా తనకు వున్న శక్తిని నమ్ముకుని మదించిన ఏనుగు మీదకు కూడా వురుకుంతుంది. కానీ మదగజము కంటే నేను చిన్న అని సింహపు పిల్ల అనుకోదు. అలాగే, తనకు అబ్బిన విద్య వల్ల, తెలివితేటల వల్ల, ఒక వెలుగు వెలిగిన వ్యక్తికి పెద్ద వయసు వచ్చినంత మాత్రమున ఆ వ్యక్తి విద్వత్తు తరగిపోదు........ అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*విద్వత్తు ని మించిన ధనము వేరొకటి వుండదు. ఐహికంగా, నిలకడగా వుండలేని ధనం వెనుకపడి మన విజ్ఞతను పోగొట్టు కోకూడదు. సంఘంలో ఎంత ఎద్ద మనిషి అయినా, తనకు వున్న విద్య సహాయపడనప్పుడు అతని మనుగడ కష్టం అవుతుంది. అందుకే, పెద్దలు చెప్పారు, విద్య వినయము ఇస్తుంది. అలాగే, విద్య ఎటువంటి పరిస్థితి ని అయినా ఎదుర్కునే ధైర్యం కూడా ఇస్తుంది. అందుకే, సమాజంలో వున్న ప్రతీ వ్యక్తీ, స్త్రీ గానీ పురుషుడు గానీ, తప్పక చదువుకోవాలి. చదువు కొనుక్కో కూడదు.  అందరికీ చదువు అబ్బే మంచి పరిస్థితి ని పరమేశ్వరుడు అనుగ్రహించాలని మనః పూర్తిగా వేడుకుంటూ.... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు