*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౫౩ - 053)*
*సుజన పద్ధతి*
ఉత్పలమాల:
*ఆపదలందు ధైర్యగుణ, మంచిసంపదలందుఁ దాల్మియున్,*
*భూపసభాంతరాళమునఁ, బుష్కలవాక్చతురత్వ, మాజిబా*
*హాపటుశక్తియున్, యశమునందనురక్తియు, విద్యయందు వాం*
*ఛాపరివృద్ధియున్, బ్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్.*
*తా:*
ఆపదలు కలిగినప్పుడు ధైర్యంగా వుండటం, సంపదలు కలసి వచ్చినప్పుడు ఓర్పుతో వుండటం, ఆఫీసులలో, రాజుగారి సభలో ఎంతవరకూ మాట్లాడాలో అంతవరకు మాట్లాడటం, యుద్ధములో తన శక్తి కి లోపంలేకుండా యద్ధం చేయడం, కీర్తి కావాలి అని కోరుకోవడం, చదువు నందు భక్తి శ్రద్ధలు కలిగి వుండటం, ఇవన్నీ మన సమాజంలో మంచివారిగా పిలవబడే వారికి వుండవలసిన లక్షణాలు......... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*ఈ పద్యంలో కవి చెప్పిన లక్షణాలు వున్న వ్యక్తి మనకు తనంత తాను తారసపడవలసిందే గానీ, మనం వెతికి పట్టుకోవడం లేదా కలుసుకోవడం అనేది మన కర్మ చక్షువులు, లేదా తొంభై శాతం మలినమైన మనసుతో సాధ్యమయ్యే పని కాదు. కానీ, ఇంత గొప్ప వ్యక్తి ఎదురుపడి పలుకరించినపుడు, ఏమాత్రం సందేహింపక ఆ స్నేహ హస్తం నిస్సంకోచంగా అందుకోవడమే మనం చేయవలసిన, చేయగలిగిన పని. ఇంత మంచి మనషుల మధ్యలో, వారి సాంగత్యంలో మనం వుండే మహద్భాగ్యాన్ని కలిగించి మనల్ని ఆశీర్వదించి, నిత్యం మనతో వుండి మనల్ని నడిపించమని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు