1.
తల్లిలాగ ఆదరించు
తండ్రిలాగ సహకరించు
శిష్యులకై శ్రమిస్తున్న
గురువులకూ సహకరించు
2.
పొత్తం విలువ తెలుసుకొని
కాలం విలువ తెలుసుకొని
చదువులన్ని చదవాలి
విధేయత నలవర్చుకుని
3.
ధనం విలువను తెలుసుకో
పొదుపుగానూ వాడుకో
ప్రాణం విలువ తెలుసుకొని
పదిలంగ కాపాడుకో
4.
నీటి విలువ తెలిసినోడు
నీరు వృధాగా చేయడు
బతుకు విలువ తెలిసిన
బాధ్యతగా మెలుగుతాడు
5
వివేకం తెలిసినవాడు
నిర్ణయాలకు స్వతంత్రుడు
స్థితప్రజ్ఞత కలిగిన
ఉన్నతాన్ని చేరగలడు
6.
అందాల రూపం తల్లి
ఆదరించు కల్పవల్లి
బిడ్డల భవిత దిద్దేటి
ప్రపంచాన వెలుగు వల్లి
7.
ఇంటి అందం స్త్రీలు
శక్తి స్వరూపిణీలు
కమ్మటి పలుకుల అమ్మలు
దేశానికి వెలుగులు
8.
ఆడపిల్ల ఆశలురా
నెరవేర్చనే లేదురా
పాపం చంపేస్తివి
ఎంత దుర్మార్గుడివిరా
9.
పూలన్నీ తెంపుదము
మాలలుగా కూర్చుదము
దేవుడి మెడలో వేస్తే
మనకు ఆశీర్వాదము
10.
మంచి వాడిల నటించకు
ఒకరిని మోసం చేయకు
కుట్రలెన్నో పన్నుతూ
నీఛానికి ఒడిగట్టకు
11.
బాల్యoలో వివాహాలు
నాశనమే జీవితాలు
ఆడపిల్లను చదివిస్థె
గొప్ప స్థాయిలో వనితలు
12.
అన్యాయాలు చెయ్యకు
స్త్రీలనూ హింసించకు
పాపాలకు ఒడిగట్టి
నరకాన్ని చూపెట్టకు
13.
సహాయాన్నే చేసినను
సంతృప్తి నీకు మిగులును
దయాగుణం ఉండినచో
పుణ్యం నీకే వచ్చును
14.
గెలిచానని మురిసిపోకు
ఓడానని ఏడ్వబోకు
స్థితప్రజ్ఞత కలిగీ
ధైర్యంగ సాగు ముందుకు
15.
నీతి కథల పుస్తకములు
పెంచునులె ఆలోచనలు
మహనీయుల చరితలతో
గమ్యాన్ని చేర్చు దారులు
16.
గురువులు చెప్పేది విను
మంచి స్థాయికి చేర్చును
జ్ఞానాన్నినీకు అబ్బును
లోక రీతీ తెలియును
17.
చెట్లను పెంచూ దండిగ
ఏ సి లు ఎందుకు దండగ
చెట్లను రక్షిoచు ముందు
నిన్నూ రక్షిస్తాయిగ
18.
పొద్దుపొద్దున లేవాలి
యోగసాధన చేయాలి
ఆలోచన కట్టిపెట్టి
శ్వాసపై ఎరుకుంచాలి
19.
కష్టంగా పని చేయకు
వెనుకడుగే అసలేయకు
విజయాన్ని తలచుకొని
ధైర్యంగ సాగు ముందుకు
20.
అందమైన పుస్తకాలు
రచయిత మనోభావాలు
పఠనం సాగించినచో
పెరుగునులె ఆలోచనలు
22.
చెట్లున్న పుడమిని చూడా
మానవ ప్రగతికి మేడా
నిలువనీడ కావాలి
నాటండి అవని నిండా
23.
కలం పట్టి రాయాలోయ్
సమస్యలూ చూపాలోయ్
సమాజాన్ని మార్చేసి
కీర్తి నీవు పొందాలోయ్
24.
పచ్చని చెట్లు నాటుదాం
కాలుష్యo పోగొడదాం
ప్లాస్టిక్ను మానుకొని
సమాజ హితo కోరుదాం
25.
మహనీయుల బాటను
జీవితాన విలువను
గుర్తించి సాగిపోతే
ఉన్నతమే నీవును
26.
నీ పుట్టిన రోజునాడు
మంచి మొక్క నాటి చూడు
వృధా ఖర్చు తగ్గునే
జీవితమె ధన్యo చూడు
27.
పచ్చని పంట పొలాలు
కిలకిలమనే పక్షులు
గలగలపారు నదులతో
అందమైనా పల్లెలు
28.
స్త్రీలను గౌరవించురా
చిన్నచూపు చూడకురా
సృష్టికి మూలమైనది
ఆడపిల్లలు శక్తిరా
29.
అందమైనా పిల్లలు
దేవుని ప్రతిరూపాలు
అమ్మ నాన్న ఆశలతో
ఆడిపాడే వయసులు
30.
ఆడపిల్ల చదువురా
అందరికీ వెలుగురా
బతుకునే మార్చేసి
వెలుగునే ఇచ్చునురా
31.
కష్టాలకు గురియైనా
పేదరికం వచ్చినా
ధైర్యాన్ని కోల్పోకు
మరణo ముందుకొచ్చినా
32.
కష్టపడీ పని చేయుము.
ఉన్నత స్థాయికి ఎదుగుము.
మంచి పేరు తెచ్చుకొని
సంతసంగ జీవించుము.
33.
అందమైన పుస్తకాలు
బడి గుడిలోన బోధనలు
ఉపాధ్యాయుల తపన
తల్లిదండ్రుల కోరికలు
34.
అహర్ణిశలు శ్రమిస్తేనె
నాలుగు రాళ్లు వచ్చునే
ప్రజలకు బువ్వ దొరుకు
చెమటను చిందిస్తేనే
35.
ఆనందాల నిలయం
అనురాగాల బంధము
ఐక్యంగ ఉండిపోతే
మనకు లేదుగా భయము
36.
ఇచ్చిన మాటను తప్పకు
అతిథిని తిరస్కరించకు
రాక్షసిలా ప్రవర్తించి
చెడ్డ పేరు తెచ్చుకోకు
37.
పచ్చని చెట్ల మా పల్లె
పంట పొలాల మా పల్లె
స్వచ్ఛంగ కలసిమెలసి
ఉందామ కుటుంబమల్లె
38.
పాడిపంటల మాపల్లె
పశుసంపదల మాపల్లె
పిల్ల పెద్దలoదరితో
కళకళలాడేను పల్లె
39.
అనురాగాల మా పల్లె
అన్నింటిలో మా పల్లె
మంచి జ్ఞానo కలిగున్న
ఆత్మీయత పంచు ముల్లె
40.
చిన్న వయసు పెళ్లొద్దు
చదువు అందరికి ముద్దు
రోగాల పాలు చేయకు
బంగారు భవిత కద్దు
41.
స్త్రీకి రక్షణ ఇచ్చినను
అన్యాయo పోగొట్టును
తన నడక తీరును గని
సమాజంమంత మారును
42.
రంగుల పూలు తీసుకొని
బతుకమ్మనే చేసితిని
గౌరమ్మను పూజించి
సతులతొ ఆడి పాడితిని
43.
పల్లెనసలు వదలుకోకు
ప్రేమభిమానం మరువకు
తల్లి ఒడిలాంటి పల్లె
అనుబంధం తగ్గించకు
44.
సేంద్రియ ఎరువు వాడయ్య
పంటలూ పండించయ్య
కష్టపడి పని చేస్తూనె
అందరి కడుపు నింపయ్య
45.
ఆస్తిచూసి మురిసిపోకు
మాటలొస్తయని ఎగరకు
అధికార మదంతోను
అవహేళన చేయబోకు
46.
మనిషికీ బుద్ధి అందం
చెట్టుకు ఆకులు అందం
వికాసాన్ని నింపేవి
నెమలికి నాట్యం అందం
47.
అంబేద్కర్ ఆశయాలు
ఆదర్శo మహనీయులు
పేదల కొరకు తపించి
చేసెనన్ని ప్రయత్నాలు
48.
గౌరమ్మా పండుగా
స్త్రీల మనసు నిండుగా
తొమ్మిది రోజులు నిష్ఠగ
బతుకమ్మను చేయగా
49.
సోమరితనమే వద్దు
కష్టమే మనకు ముద్దు
పిసినారితనం వీడు
దానమే మనకు హద్దు
50.
దేశానికి మన ఐలమ్మ
రోకలెత్తిన నేలమ్మ
తొడగొట్టెను చూడండి
సాహస చాకలైలమ్మ
తల్లిలాగ ఆదరించు
తండ్రిలాగ సహకరించు
శిష్యులకై శ్రమిస్తున్న
గురువులకూ సహకరించు
2.
పొత్తం విలువ తెలుసుకొని
కాలం విలువ తెలుసుకొని
చదువులన్ని చదవాలి
విధేయత నలవర్చుకుని
3.
ధనం విలువను తెలుసుకో
పొదుపుగానూ వాడుకో
ప్రాణం విలువ తెలుసుకొని
పదిలంగ కాపాడుకో
4.
నీటి విలువ తెలిసినోడు
నీరు వృధాగా చేయడు
బతుకు విలువ తెలిసిన
బాధ్యతగా మెలుగుతాడు
5
వివేకం తెలిసినవాడు
నిర్ణయాలకు స్వతంత్రుడు
స్థితప్రజ్ఞత కలిగిన
ఉన్నతాన్ని చేరగలడు
6.
అందాల రూపం తల్లి
ఆదరించు కల్పవల్లి
బిడ్డల భవిత దిద్దేటి
ప్రపంచాన వెలుగు వల్లి
7.
ఇంటి అందం స్త్రీలు
శక్తి స్వరూపిణీలు
కమ్మటి పలుకుల అమ్మలు
దేశానికి వెలుగులు
8.
ఆడపిల్ల ఆశలురా
నెరవేర్చనే లేదురా
పాపం చంపేస్తివి
ఎంత దుర్మార్గుడివిరా
9.
పూలన్నీ తెంపుదము
మాలలుగా కూర్చుదము
దేవుడి మెడలో వేస్తే
మనకు ఆశీర్వాదము
10.
మంచి వాడిల నటించకు
ఒకరిని మోసం చేయకు
కుట్రలెన్నో పన్నుతూ
నీఛానికి ఒడిగట్టకు
11.
బాల్యoలో వివాహాలు
నాశనమే జీవితాలు
ఆడపిల్లను చదివిస్థె
గొప్ప స్థాయిలో వనితలు
12.
అన్యాయాలు చెయ్యకు
స్త్రీలనూ హింసించకు
పాపాలకు ఒడిగట్టి
నరకాన్ని చూపెట్టకు
13.
సహాయాన్నే చేసినను
సంతృప్తి నీకు మిగులును
దయాగుణం ఉండినచో
పుణ్యం నీకే వచ్చును
14.
గెలిచానని మురిసిపోకు
ఓడానని ఏడ్వబోకు
స్థితప్రజ్ఞత కలిగీ
ధైర్యంగ సాగు ముందుకు
15.
నీతి కథల పుస్తకములు
పెంచునులె ఆలోచనలు
మహనీయుల చరితలతో
గమ్యాన్ని చేర్చు దారులు
16.
గురువులు చెప్పేది విను
మంచి స్థాయికి చేర్చును
జ్ఞానాన్నినీకు అబ్బును
లోక రీతీ తెలియును
17.
చెట్లను పెంచూ దండిగ
ఏ సి లు ఎందుకు దండగ
చెట్లను రక్షిoచు ముందు
నిన్నూ రక్షిస్తాయిగ
18.
పొద్దుపొద్దున లేవాలి
యోగసాధన చేయాలి
ఆలోచన కట్టిపెట్టి
శ్వాసపై ఎరుకుంచాలి
19.
కష్టంగా పని చేయకు
వెనుకడుగే అసలేయకు
విజయాన్ని తలచుకొని
ధైర్యంగ సాగు ముందుకు
20.
అందమైన పుస్తకాలు
రచయిత మనోభావాలు
పఠనం సాగించినచో
పెరుగునులె ఆలోచనలు
22.
చెట్లున్న పుడమిని చూడా
మానవ ప్రగతికి మేడా
నిలువనీడ కావాలి
నాటండి అవని నిండా
23.
కలం పట్టి రాయాలోయ్
సమస్యలూ చూపాలోయ్
సమాజాన్ని మార్చేసి
కీర్తి నీవు పొందాలోయ్
24.
పచ్చని చెట్లు నాటుదాం
కాలుష్యo పోగొడదాం
ప్లాస్టిక్ను మానుకొని
సమాజ హితo కోరుదాం
25.
మహనీయుల బాటను
జీవితాన విలువను
గుర్తించి సాగిపోతే
ఉన్నతమే నీవును
26.
నీ పుట్టిన రోజునాడు
మంచి మొక్క నాటి చూడు
వృధా ఖర్చు తగ్గునే
జీవితమె ధన్యo చూడు
27.
పచ్చని పంట పొలాలు
కిలకిలమనే పక్షులు
గలగలపారు నదులతో
అందమైనా పల్లెలు
28.
స్త్రీలను గౌరవించురా
చిన్నచూపు చూడకురా
సృష్టికి మూలమైనది
ఆడపిల్లలు శక్తిరా
29.
అందమైనా పిల్లలు
దేవుని ప్రతిరూపాలు
అమ్మ నాన్న ఆశలతో
ఆడిపాడే వయసులు
30.
ఆడపిల్ల చదువురా
అందరికీ వెలుగురా
బతుకునే మార్చేసి
వెలుగునే ఇచ్చునురా
31.
కష్టాలకు గురియైనా
పేదరికం వచ్చినా
ధైర్యాన్ని కోల్పోకు
మరణo ముందుకొచ్చినా
32.
కష్టపడీ పని చేయుము.
ఉన్నత స్థాయికి ఎదుగుము.
మంచి పేరు తెచ్చుకొని
సంతసంగ జీవించుము.
33.
అందమైన పుస్తకాలు
బడి గుడిలోన బోధనలు
ఉపాధ్యాయుల తపన
తల్లిదండ్రుల కోరికలు
34.
అహర్ణిశలు శ్రమిస్తేనె
నాలుగు రాళ్లు వచ్చునే
ప్రజలకు బువ్వ దొరుకు
చెమటను చిందిస్తేనే
35.
ఆనందాల నిలయం
అనురాగాల బంధము
ఐక్యంగ ఉండిపోతే
మనకు లేదుగా భయము
36.
ఇచ్చిన మాటను తప్పకు
అతిథిని తిరస్కరించకు
రాక్షసిలా ప్రవర్తించి
చెడ్డ పేరు తెచ్చుకోకు
37.
పచ్చని చెట్ల మా పల్లె
పంట పొలాల మా పల్లె
స్వచ్ఛంగ కలసిమెలసి
ఉందామ కుటుంబమల్లె
38.
పాడిపంటల మాపల్లె
పశుసంపదల మాపల్లె
పిల్ల పెద్దలoదరితో
కళకళలాడేను పల్లె
39.
అనురాగాల మా పల్లె
అన్నింటిలో మా పల్లె
మంచి జ్ఞానo కలిగున్న
ఆత్మీయత పంచు ముల్లె
40.
చిన్న వయసు పెళ్లొద్దు
చదువు అందరికి ముద్దు
రోగాల పాలు చేయకు
బంగారు భవిత కద్దు
41.
స్త్రీకి రక్షణ ఇచ్చినను
అన్యాయo పోగొట్టును
తన నడక తీరును గని
సమాజంమంత మారును
42.
రంగుల పూలు తీసుకొని
బతుకమ్మనే చేసితిని
గౌరమ్మను పూజించి
సతులతొ ఆడి పాడితిని
43.
పల్లెనసలు వదలుకోకు
ప్రేమభిమానం మరువకు
తల్లి ఒడిలాంటి పల్లె
అనుబంధం తగ్గించకు
44.
సేంద్రియ ఎరువు వాడయ్య
పంటలూ పండించయ్య
కష్టపడి పని చేస్తూనె
అందరి కడుపు నింపయ్య
45.
ఆస్తిచూసి మురిసిపోకు
మాటలొస్తయని ఎగరకు
అధికార మదంతోను
అవహేళన చేయబోకు
46.
మనిషికీ బుద్ధి అందం
చెట్టుకు ఆకులు అందం
వికాసాన్ని నింపేవి
నెమలికి నాట్యం అందం
47.
అంబేద్కర్ ఆశయాలు
ఆదర్శo మహనీయులు
పేదల కొరకు తపించి
చేసెనన్ని ప్రయత్నాలు
48.
గౌరమ్మా పండుగా
స్త్రీల మనసు నిండుగా
తొమ్మిది రోజులు నిష్ఠగ
బతుకమ్మను చేయగా
49.
సోమరితనమే వద్దు
కష్టమే మనకు ముద్దు
పిసినారితనం వీడు
దానమే మనకు హద్దు
50.
దేశానికి మన ఐలమ్మ
రోకలెత్తిన నేలమ్మ
తొడగొట్టెను చూడండి
సాహస చాకలైలమ్మ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి