అవి
యూనివర్సిటీ రోజులు!
అప్పట్లో చక చకా
కొండమెట్లు ఎక్కి
ఆ గోవిందుని-
దర్శనం చేసుకున్నరోజులు
మరపురాకున్నాయి!
కొండమీద
మేమందరం కలసి
తిరిగిన
బృందవనాలు
ఇంకా మదిలో-
మెదలాడుతూనే ఉన్నాయి!
అలసి సొలసి
కలసి కూర్చున్న చోట
పుల్ల ఐస్ లు-
తింటే ఇచ్చిన
చల్లదనం ఇంకా
జిహ్వ దాటనేలేదు!
పాల సపోట తిన్న వైనం
లడ్డు పంచుకున్న-
మధురజ్ఞాపకం
ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో
మధురస్మృతులు
స్మృతిపధాన-
ఇంకా తచ్చాడుతూనే
ఉన్నాయి!
ఆనాటి రోజులే
వేరు....!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి