అటూ -ఇటూ ..!!; -సురేందర్ రెడ్డి .కె
ఆమె
నా మదిలో 
కొలువైవున్నావిడ!

విధి విడదీసింది
ఇప్పుడు...అప్పుడప్పుడు
వినిపిస్తుంది...కానీ
కనపడదు...
చాలా దూరం లో -
నాకు తను....!

వెలుగులోకి వచ్చిన
శాస్త్రీయ విజ్ఞానం 
పుణ్యామా అని
చరవాణి ఆవిష్కరణ
మాలో  చిగురించిన ఆశలెన్నో!

వీడియో కాల్స్ లో
కలుస్తూనే ఉంటాం
కానీ...
అదేం చిత్రమో..విధి విచిత్రమో
పక్కన మా ఆవిడ.. పిల్లలు
ఉన్నప్పుడే వస్తుందినాకు
నాప్రియమైన ఫోన్ కాల్!

ఇబ్బంది లో నేను
నాపరిస్థితి అర్ధచేసుకోలేక
తను.....!!
                 ***


కామెంట్‌లు