శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు;-   కృష్ణవేణి పరాంకుశం
ప్రతి ఉదయం అవనికి అరుణోదయం
ప్రతి రాగం ఆశాహృదయాల రాగోదయం
నవనవోన్మేష నవవత్సర ఉషోదయం
శుభకృత్  నామ నవ్యపద భానోదయం.

కోయిల గీతాలతో...
పూల రాగాలతో...
ఆమని అందాలతో...
వసంత శోభలతో..
వర్షించే మేఘాల...
హర్షించే జీవితాల...
నవ్వుల జ్యోతులను వెలిగిస్తూ..
ఆశల పల్లకి ఎక్కిస్తూ...

ఆరు ఋతువులు ఆశావాహికలై..
ఆరు రుచులు జీవన మధురిమలై...
నవ్య వాసంత కాంతులకు నిర్వచనమై...
శుభకృత్ అంటూ ..శుభాలను మోసుకుంటూ వస్తున్న
నవయుగ ఆది ఉగాది.

గ్రహాల గతుల...
ప్రకృతి స్థితి గతులకు కొలమానంగా...
కొత్త ప్రణాళికల మార్గనిద్దేశంగా...
పంచాంగ శ్రవణాన్ని ప్రపంచానికి తెలియజెప్పే తిధి.
పాత కొత్తల సమ్మేళన వారధి.
తెలుగువారి సంస్కృతి సాంప్రదాయ
సారూప్యతల జీవనపరమావధి.
విధాత విరచించిన .....
అనంత సృష్టికి  పునాది...మన ఉగాది.
***********

   

కామెంట్‌లు