రంగు రంగుల పక్షులు!(దక్షిణ అమెరికా జానపద కథ)అచ్యుతుని రాజ్యశ్రీ

 నేడు మనంచూస్తున్న పక్షులకి రంగుల ఈకలు ఎలావచ్చాయో తెలుసా? ఒకప్పుడు అడవిలోని పిట్టలన్నీ నలుపుతెలుపు రంగులోనే ఉండేవి. అక్కడే పసుపువన్నెలపాముకూడా ఉంది. అది ఒకసారి  ఎర్రని పూలపై పాకుతూ వాటిని తినసాగింది.కాసేపైనాక తన శరీరంపై ఎర్రచారలు మచ్చలు కనపడితే ఆశ్చర్య పోయింది. అలాగే నీలంరంగుపూలపై ప్రాకి వాటినికూడా తినటంతోదాని శరీరంపై నీలిచారలు మచ్చలు ఏర్పడ్డాయి. అలా ఆపాము అడవిఅంతా పాకుతూ రకరకాల పువ్వులు తిని ఇంద్రధనస్సు లాంటి రంగుల్ని శరీరమంతా పొందింది. "ఆహాహా!ప్రపంచంలో నాఅంత  అందమైన  పాములేనేలేదు"అని కేరింతలు కొడుతూ బుస్సు బుస్ అంటూ గొప్పగా షికార్లు కొడుతుంటే  చెట్టు పై ఉన్న పక్షులకు ఎక్కడలేని కోపం ఉక్రోషం ముంచుకొచ్చాయి.అవి పాముచుట్టూ చేరి దాన్ని ఏడిపిస్తూ పాటలుపాడుతూ  కిచకిచలాడుతూ గోలచేయసాగాయి."ఏయ్!పాము! నీవు అందమైన పూలరంగుల్ని మింగి ఒంటినిండా పులుముకున్నావు. అడవంతా నాశనంచేసి కేవలం ఆకుపచ్చ రంగుని మాత్రం మిగిల్చావు.ఇలా ప్రకృతి అందాన్ని నాశనంచేసిన నిన్ను మేము క్షమించం! మాముక్కులతో పొడిచి నిన్ను చంపేస్తాం".  "అవును  నేను దురాశ తో అడవి అందాన్ని నాశనంచేసినందుకు సిగ్గు పడుతున్నాను.నాకు అహంకారం ఎక్కువ "అని పాము సిగ్గు పశ్చాత్తాపంతో  అలాపాకుతూ ఓచీకటి మరుగున తన శరీరపు చర్మాన్ని ఊడివచ్చేలా చెట్లబోదెలకు రుద్దింది.ఆవిభిన్న రంగుల పాముతోలు ముక్కలు ముక్కలుగా చిరిగి పసుపు వన్నెశరీరంతో మిగిలింది. పిట్టలు అన్నీ ఆరంగుముక్కలను తమశరీరం రెక్కలపై కప్పుకున్నాయి.అంతే వాటి రెక్కలు ఈకలురకరకాల వర్ణాల తో మెరవసాగాయి.కింగ్ ఫిషర్ గాఢనీలి రంగు  బుల్లి హమ్మింగ్బర్డ్ కంఠంఎరుపు ..ఇలా రకరకాల రంగులతో మెరిసిపోయాయి.కాకి కోకిలకు ఆరంగులు నచ్చక నలుపుగానే ఉండిపోయాయి.అందుకే దక్షిణ ఆఫ్రికా లో రంగు రంగుల పిట్టలు కిచకిచలాడుతూ సందర్శకులను ఆకర్షిస్తాయి🌹
కామెంట్‌లు