ఏప్రిల్ నెలకు
స్వాగతం ....!
చలికి గుడ్‌బై చెప్పి
వేసవితాపాన్ని
మోసుకొచ్చే ...
ఏప్రిల్ నెలకు
సుస్వాగతం ...!
చిన్నపుడు
హైస్కూలు లో
చదువుకునేటప్పుడు
ఏప్రిల్ (ఫూల్ )ఆట
ఆడుకోవడంగుర్తుంది
తెలియకుండా
వెనకనుండి చొక్కామీద
సిరాచల్లుకోడం '
బాగాగుర్తుంది ......!
అలాఎందుకో
అర్థంకాని రోజులవి
లేనివివున్నట్టు చెప్పి
ఫూల్ చేయడం ....
అప్పటి సరదా అలా !
ఈ ఏప్రిల్ నెలకు
అంతకుమించిన
ప్రాముఖ్యం ....
ఇప్పుడు అర్ధమవుతోంది !
ఉగాది ,శ్రీరామనవమి ,
గుడ్ ఫ్రైడే ....
జగజ్జీవన్ రాం -అంబేడ్కర్
జయంతులు ఈనెలలోనే !
అందుకే ...
ఏప్రిల్ నెల
అందరూ గుర్తుంచుకోదగ్గ
ప్రత్యేకమైన నెల !
'ఏప్రిల్ ఫూల్ ' కాదు
ఇది నమ్మండి నిజం...!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి