ఆమ్మో ..నీళ్లు ..!!*డా.కె.ఎల్.వి.ప్రసాద్ -హన్మకొండ
నీటి విలువ 
తెలియాలంటె ,
వేసవికాలం 
రావలసిందే !
వర్గాలు 
కురవకుంటే ,
నీటి ఎద్దడి 
సరే సరి !

డబ్బున్నవాడు 
గంగను 
పాతాళంలో ఉన్నా ,
వనరులు 
ఉపయొగించి ,
ప్రతి నీటి చుక్కను 
పైకి లాక్కొస్తాడు !

పేద బ్రతుకుల 
నారీమణులు ,
కాలంతో 
సంబందం లేకుండా 
గుక్కెడు మంచినీళ్ళకోసం 
గంటలకొద్దీ 
నడిచిపోవలసిందే !

బడాబాబుల 
బోర్ల తాకిడికి 
బావులన్ని 
ఎండిపోయి ,
తాగే నీళ్ల కోసం 
తహ తహ లాడే 
సామన్య ప్రజానీకం ,
ఐదేళ్లకోసారి 
హామీ పత్రం 
చూసుకుని,
తాత్కాలిక 
ఉపశమనం తో ,
చప్పుడు చెయకుండా 
కుక్కిన పేనుల్లా 
పడి ఉంటారు .

నీటి విలువ 
తెలిసినా ..
తెలియనట్టు 
ఫోజుకొట్టి 
నిర్లక్షంగా 
నీటిని వదిలేసే 
మహానుభావులున్న 
సమాజం మనది !

నీరుంది కదా అని,
గేలన్లకొద్దీ నీటిని 
వృదా చేయడం ,
నేరం ..!
కరెంటు ఉంది అని,
మోటారు వేసి ,
మరచి పొవడం 
మాహా నేరం !

మన చేతిలో 
వృదా అయ్యే 
ప్రతి నీటిబొట్టు ,
మరొకరి గొంతు 
ఎండిపోవడానికి 
కారణం అవుతుందని 
అసలు మర్చిపోకూడదు .

మనం ఆదాచేసే 
ప్రతి నీటి చుక్క ..
రేపటి తరానికి 
అవసరం అయ్యే 
అమృతపు చుక్కలని 
అర్దం చెసుకొవాలి !

వర్షించే రోజుల్లో 
వర్షపు నీటిని 
భద్రపరుచుకోడం 
ఎంత ముఖ్యమో ..
ప్రతి ఇంటికి 
ఒక ఇంకుడు గుంత 
అవసరం అన్న ,
నగ్న సత్యాన్ని ,
ప్రతి బాధ్యత గల 
పౌరుడు 
గుర్తెరగాలి!!
-----డా .కె.ఎల్వీ.

కామెంట్‌లు