:ప్రగతి పథంలో భారత్ ;- నెల్లుట్ల సునీత--ఖమ్మం
అగ్రగామిగా నిగ్రహంగా 
విశిష్ట ప్రతిభకు నిదర్శనంగా 
సకల కార్యకలాపాల దిగ్విజయంగా 
ప్రగతి పథంలో భారత్ 
మునుముందుకు వెళుతోంది 
అన్ని రంగాల్లో ఆదర్శప్రాయంగా 
సౌలభ్యాల సుసంపన్నంగా 
విద్యారంగాన మేటితనంగా 
సాంకేతిక పరిజ్ఞాన ప్రమిదగా 
సాంస్కృతులకు నిలయంగా 
ఒక పద్ధతి ప్రతిపాదికన 
అచంచలమైన ప్రగతి భారత్ 
స్నేహభావ సహనతగా 
సహాయ సహృదయతగా 
దేశభక్తి పరమావధి దిశగా 
సకల వృత్తుల నైపుణ్యంగా 
ప్రఖ్యాతి కిర్తికి నెలవుగా 
ఆదరించే గుణఘణంగా 
మన్నన పొందిన ప్రగతి భారత్ 
అఖండమైన ఖ్యాతి భారత్ 


               -

కామెంట్‌లు