*పరోపకార పద్ధతి*
చంపకమాల:
*వితతజగద్భరంబు దన వీపునఁ దాల్చిననకూర్మనాధుఁడున్*
*సతతము చంద్రభాస్కరుల చక్రముఁద్రిప్పుధ్రువుండు సజ్జనుల్;*
*ప్రతిభ నజాండజంతుఫల రంధ్రవసన్మశకంబులట్ల నిం*
*దితవిఫలార్ధసంగతి జనించి నశించుఁదదన్యజంతువుల్.*
*తా:*
అన్ని లోకాల బరువును మోస్తున్న తాబేలు పుట్టుక, సూర్యచంద్రలను ఒక చక్రం లో తిరిగేటట్టు చేస్తున్న ధ్రువుని పుట్టుక ధన్యమైనవి. ఎందువలన అంటే, తాబేలు వలన, ధ్రువుని వలన ప్రపంచానికి మంచి జరుగుతోంది, పరోపకారం జరుగుతోది కనుక. ఎదుటి వారికి ఉపయోగించే అలోచనలు, పనులు చేయలేని వారు అత్తిపండు లో వున్న చిన్న పురుగులాగా ఏవిధమైన ప్రాధాన్యత లేకుండా నాశనము అవుతారు........... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*"పరోపకారార్ధ మిదం శరీరం" మానవ జన్మకు ఈ వాక్యం తలమానికము. అందరూ నిర్ద్వందంగా ఒప్పకోవలసిన విషయం. మానసికంగా గాని, ప్రత్యక్షంగా కానీ, డబ్బు రూపంలో గానీ, ఏదోఒక రూపంలో ఎదుటి వారికి సహాయ పడాలి అనే అలోచనలు లేని వారు ఎంతవకాలం జీవించి వున్నా ఎవరికీ ఉపయోగము వుండదు. ఇటువంటి వారు నిరర్ధక జన్మ పొందినవారికింద లెక్క. వీరి వల్ల వ్యక్తులకు గానీ సమాజానికి గానీ ఎటువంటి ఉపయోగం వుండదు. అందువల్ల మనము ప్రతి ఒక్కరమూ మన మన స్థాయిలో ఎదుటి వారికి సహాయపడే మంచి మనసు కలిగి ఉండేలా అనుగ్రహించాలని ఆ సర్వేశ్వరుని వేడుకుంటూ ...... .*
..... ఓం నమో వేంకటేశాయ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి