*పరోపకార పద్ధతి*
శార్దూలము:
*ఆశాసంహరణంబు, నోర్మియు, మద త్యాగంబు, దుర్దోష వాం*
*ఛాశూన్యత్వము, సత్యమున్, బుధమతాచారంబు, సత్సేవయున్*
*వైశర్యంబును, శత్రులాలనము, మాన్యప్రీతయుం, బ్రశ్రయ*
*శ్రీశావిత్వము, దీనులందుఁగృపయున్, శిష్టాలికిన్, ధర్మముల్.*
*తా:*
ఆశను చంపుకొనుట, ఓర్పు కలిగి వుండటము, గర్వాన్ని వదలి వేయడం. చెడు పనులు చేయాలి అనే కోరికను వదిలేయడం, సత్యం మాట్లాడటం, పెద్దలు చూపిన మంచి ఆచార పద్దతులను పాటించడము, మంచివారు, పండితుల సేవ చేయడము, పూజ్యలను సేవించడము, శత్రవును అయినా అభిమానించడము, పెద్దల యందు అణుకువ కలిగి వుండటము, కీర్తికి భంగము రాని విధముగా నడచుకోవడము, బాధలు అనుభవిస్తున్న వారి యందు దయ గలిగి వుండటము, ఈ లక్ణాలు అన్నీ సత్పురుషులకు అలంకారములు............ అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*సమాజంలో తక్కువ స్థాయి లో వున్నవారి మీద అపహాస్యం చేయాలి అనే అలోచన చేయకుండా వారికి అండదండగా నిలబడటం మన అందరి కర్తవ్యం కావాలి. మన పక్కవారు ఇబ్బందులలో వుంటే నాకేమిటి అనుకోకుండా మనకు అవకాశం వున్నంత వరకూ వారి ఇబ్బందులు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. వారి బాధపంచుకునే చల్లని మాటలు చెప్పినా కూడా వారిపై బాధ ప్రభావం కొంచమైన తగ్గుతుంది. అభిమానానికి పోకుండా, గురువుల యందు, పెద్దల యందు గౌరవమర్యాదలు కలిగి నడుచుకోవాలి. ఇటువంటి మంచి లక్షణాలు మనకు అబ్బే లా శంభుని అనుగ్రహం వుండాలి అని వేడుకుంటూ...... .*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి