మన భాష తెలుగు తెలుసుకుంటే వెలుగు తెలుగు ఒడిలో....19;--వ్యాసకర్త;-రాజావాసిరెడ్డిమల్లీశ్వరి
చింతచెట్టు 

మనకు ఉపయోగపడే
చెట్లలో  ఆముదపు చెట్టు ఒకటి.దీనిగింజల నుండి నూనెను తీస్తారు. ఈ నూనెతో
ఒకప్పుడు దీపాలను వెలిగించే వారు. పొట్టను శుభ్రం చేసుకోటానికి చిన్న పెద్ద అందరు నెలకో సారి ఓ
గరిట నులివెచ్చని ఆముదాన్ని తాగేవారు.
తలకు రాసుకునే నూనెను ఆముదంతో తయారుచేసెవారు. 

ఇంతగా ఎంతో ఉపయోగపడే  ఆముదపు చెట్టును
అంబుకము, అమండము,  గంధర్వహస్తము, త్రిపటీఫలము, వాతఘ్నము, ముత్తవ
వంటి పేర్లతో పిలుస్తారు.

మన తెలుగు  సాహితీ ప్రక్రియయైన సామెతలలో
" ఆముదం కొలిచే తవ్వి
ఎప్పుడూ జిడ్డే 
ఆముదపు విత్తులు ఆణి ముత్యాలగునా.
ఆముదపు చేటేగాని
బిడ్డ బ్రతుకదు.
ఆముదాల బేరం కామెర్ల రోగం నమ్మరానివి " .వంటి 
సామెతలెన్నో ఉన్నాయి

ఇంకా ఆముదం చెట్టు  గురించి....
ఓహో సన్నాసి
నీపై నిండా విభఃతి
నీ సేతువు శంఖు చక్రాలు
నీ నెత్తిన రుద్రాక్షలు...

దానాకు ఛామెరాకు   
దాని పూత తేనెపూత
దాని మొదలు చెరుకు
మొదలు...


దాని మొదలు
చెరుకు మొదలు
దాని ఆకు
దామెరాకు
దాని పూత 
మేడి పూత
దాని కాత
గుజ్జ కాత....వంటి
పొడుపు కథలున్నాయి.
అంతే కాదు...
కర్ర వెదురు కర్ర
ఆకు అరచెయ్యి...
ఆముదపు చెట్టును
ఆసాంతం వర్ణించిన 
పొడుపుకథలున్నాయి.

అంతేనా..
ఒక కాయ
కారుకు మూడు  
పప్పులు
పప్పుకు ఒక గింజ......

లోపల పప్పులుండు
కాకరకాయ కాదు
కాచిన నెయ్యి వచ్చు
వెన్న కాదు ( ఆముదపు గింజ) 

మిట్ట మధ్యాహ్నం
ముగ్గురు దొంగలు
మాయమై పోలీసులు
( ఆముదపు కాయ,)
వంటి  పొడుపు కథలున్నాయి.


చూశారా !  తెలుగు సాహిత్యం చదివితే
ఎన్ని చణత్కాలు,ఎంత విజ్ఞానం తెలుస్తుందో...


కామెంట్‌లు