జాబిల్లి -హరివిల్లు-రావిపల్లి వాసుదేవరావు-పార్వతీపురం మన్యం జిల్లా9441713136
రమ్మంది రమ్మంది 
జాబిల్లి రమ్మంది
చల్లదనమూ ఇచ్చి
కబుర్లు చెప్పింది

రమ్మంది రమ్మంది
తారక రమ్మంది
తేట వెలుగు ఇచ్చి
పాటలను నేర్పింది

రమ్మంది రమ్మంది
హరివిల్లు రమ్మంది
తనలోని రంగులతో
బొమ్మను వేయిమంది

రమ్మంది రమ్మంది
భ్రమరమ్ము రమ్మంది
ఝుమ్మనే రాగాన్ని
తనతో పాడమంది

రమ్మంది రమ్మంది
తూనీగ రమ్మంది
తనతోని గాలిలో
ఎగరమని రమ్మందికామెంట్‌లు