సృష్టికర్త ;-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.--సెల్ నెంబర్.9491387977.
రూపంలేని స్వరూపం ధూపం
మీ కవిత కథనం అపురూపం
సమతా మమతల స్వరూపం
శాంతి సహనాల సాక్షాత్కారం !

సృష్టికర్త ఒక్కడే ఒక్కడే
 వాడుఇక చిక్కడే చిక్కడే
ఆట బొమ్మల ఆడిస్తుండు
అంతరంగాన్ని నడిపిస్తుండు !

కాయాన్ని కాల్చక ముందే
గాయాన్ని గెలిగించక నందే
పూఇంచు ప్రేమ సుసుమాల
వెలిగించు కాంతి పుంజముల.!

సత్యంతో ధర్మచింతన చేసి
నిర్మల చిత్త తత్వ వత్తినివేసి
హృదయ ప్రమిదలోతైలంపోసి
నీవే ఉదయక్షమా కరుణ రూపసి!

గీతా ఖురాను బైబిల్ గ్రంధాలను
నిత్యం క్రమశిక్షణతో పఠిస్తే నీవు
నీ మదిలో వెలుగు ధర్మ తత్వం 
భోధపడు  శాంతి మూర్తిమత్వం !కామెంట్‌లు