76) కీచురాళ్ళ చప్పుడు
ఇక విన్నావా ఇప్పుడు
వీనులకు ఒకటే రొద
మరి వినవద్దు ఎప్పుడు
77). నకిలీ విత్తనాల చే
రైతన్న ముఖము వాచే
ఎన్నాళ్ళిక ఈ దోపిడీ
ఎదురుగాలి ఇక వీచే!
78) ఆశకు అంతులేదురా
తెలుసుకొని నడుచుకో రా
ఆశ పాశం మాను
ఆ దిక్కకు చూడకురా!
79) ఓంకారంను జపించు
ముక్తి కోసం తపించు
విభూది మహిమను తెలుపు
శివున్ని ఇక పూజించు !
80). ఇల్లు ఒక దేవాలయం
ప్రేమలకు ఆది నిలయం
ఆనందాల హరివిల్లు
కలిసి బతికే ఆలయం !
81). అతివ అసాధ్య రాలు
పెట్టేను చెవిలో పూలు
ఆమె తో జాగ్రత్త
ఐతే మనకే మేలు!
82). ప్రేమ ఎంత మధురం
తెలుపునులే అధరం
జగమే ప్రేమమయం
కమనీయ సుందరం !
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి