దేవుని సృష్టి;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి.94928 11322
 దేవుడు మనిషిని సృష్టించాడా మనిషి దేవుణ్ణి సృష్టించాడా అన్నది సమాధానం లేని ప్రశ్న  ఏ దేశంలో నైనా, ఏ ప్రాంతంలోనైనా సరే ఇదే  భగవంతుడు అని చెప్పుకుంటారా? మరి ఇంత మంది దేవుళ్ళు ఎలా వచ్చారు  ప్రత్యక్షంగా మనం కూడా చూస్తూ ఉంటాం గణాచారులు,  నేను ఇక్కడికి రావాలి అనుకుంటున్నాను నన్ను ఇక్కడ ప్రతిష్టించండి అని  కేకలు, తనను తాను కొట్టుకోవడం లాంటివి జరుగుతున్నాయి. ఎవరో పుణ్యాత్ముడు  ఒక రాత్రి తలచుకొని దేనినో శిల్పంగా చేసి దానికి రూపాన్ని పెట్టి  పూజలు చేసి ఈ దేవునికి  ఇంత శక్తి ఉంది, అంత శక్తి ఉంది కోరిన వారి కోరికలు తీరుతూ వుంటాయి అని చెప్పుకోవడం వింటూ ఉంటాం. భగవంతుడు ఎవరు? ఆ కోరికలు ఎలా తీరుస్తాడు? ఒకే విషయం మీద ఇద్దరు తగువులాడి  చివరకు కోర్టుకు వెళ్ళినప్పుడు ఇద్దరూ  భగవంతుని తలుచుకుని ముడుపుకట్టి  నన్ను గెలిపించు స్వామి అని వేడుకుంటారు.  మరి నిజంగా ఆ భగవంతుడు వారి  ఇద్దరి కోరికలను తీర్చగలడా? అది సాధ్యమయ్యే పనేనా?.
కనుక  భగవంతుడు మానవ సృష్టి ఇది కాదనలేని నిజం.  దానికి వేమన ఏం చెప్తున్నాడు  ఏ దేశంలోనో, ఏ ప్రాంతంలోనో భగవంతుడు ఉండడు  అది ఆత్మకు సంబంధించిన విషయం. ఇలా వేషాలు వేసే ప్రతి ఒక్కరూ కూడా గ్రాసము కొరకే అని స్పష్టం చేశారు వేమన.  కొన్ని సంఘటనలను మనం చూసినప్పుడు  వేమన మహర్షి  ఎంత గొప్పగా నిశితంగా పరిశీలించి చెప్పాడో ఈ విషయాన్ని గురించి అని అనిపిస్తుంది. నిజానికి భగవంతుడు అనే శబ్దానికి అర్థం వెలుగు చూపు వాడు అని. దేవుడు అంటే    జ్ఞానాన్ని ప్రసాదించే వాడు ఈ అర్థాలు తెలిసి ఉండవు.  విషయాలను, సంఘటనలు పరిశీలించకుండా మూర్ఖంగా వున్న ప్రతి విషయాన్ని  వేమన  అడ్డుకుంటూనే ఉంటాడు అది మనం గమనించాలి.కామెంట్‌లు