ఎవరైనా ఒక కార్యాన్ని సాధించాలి అనుకున్నప్పుడు దాని పూర్వాపరాలు తెలుసుకోవడం ఎలాంటి ప్రయత్నం చేస్తే దానిని సాధించగలమో అని ఊహించడం అంకితభావంతో పని చేయడం వల్ల అది సఫలం అవుతుంది. అలా కాకుండా ఊహల్లో తేలిపోతే ఏమవుతుంది ఆదర్శం ఆదర్శంగా ఊహల్లోనే ఉండిపోతుంది. బిడ్డ పుష్టిగా ఉండాలంటే పౌష్టిక ఆహారమైన పాలు ఇవ్వాలి తల్లి దగ్గర పాలు సరిపోక పోతే అప్పుడు ఆవునో, గేదెనో ఆశ్రయించాలి అవి లేనప్పుడు పాలు ఎక్కడి నుంచి వస్తాయి. ఆ గేదెలను మేపాలి, పాలు తీయాలి, వాటిని కాగబెట్టాలి, తిరిగి ఆరబెట్టి, బిడ్డకు ఎంత వేడి సరిపోతుందో చూసి అప్పుడు పాలు పట్టాలి. అలాగే సంగీతం నేర్చుకోవాలనుకుంటే గాత్రాన్ని స్వాధీన పరుచుకోవాలి. శృతి, తాళం అంటే ఏమిటో తెలియాలి. వేమన గారు చెప్పిన ఉదాహరణ "అనగననగ రాగ మతిశయించుచుండు" అలాగే నీకు సంగీతం రాదని మడిగట్టుకొని కూర్చున్న వాడు కూడా గురుముఖతా నేర్చుకోవడానికి ప్రయత్నం చేసి వారిని అనుసరించినా, అనుకరించినా సప్తస్వరాలు వంటపడతాయి. ఏడు అక్షరాల కలయికతో త్యాగరాజ స్వామి అన్నమాచార్య లాంటి మహానుభావులు కొన్ని వేల కీర్తనలను రాశారు. ఇన్ని వ్రాయగలమా అని అనుకొని ప్రయత్నాన్ని మానితే ఎంతమంది సంగీత ప్రియులకు ఇన్ని రాష్ట్రాలలో పేరుప్రఖ్యాతులు వచ్చి ఉండేవి కాదు కదా. వేపాకు చేదుగా ఉంటుందని తినడం మానేస్తే శరీరంలో ఉన్న రుగ్మతలు ఎలా పోతాయి ముందు చిగురాకుల తో ప్రారంభించి, రోజుకు కొంత ప్రయత్నం చేస్తే అలాగ "తినగ తినగ వేము తియ్యనుండు" అన్నది వ్యక్తిగతంగానూ తెలుసుకుంటాం. అలాంటి వేద సూక్తులను ఎన్నో చెప్పిన మహానుభావుడు మానవుల ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా ఎన్ని సూత్రాలు చెప్పాడో తెలుసుకుంటే ఆయన ఎంత వైద్యుడో మనకు అర్థమవుతుంది.
తినగ తినగ వేము తియ్యనుండు;-ఏ.బి ఆనంద్,--ఆకాశవాణి.--94928 11322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి