ప్రపంచ ప్రఖ్యాత నాటకాలు కానీ కావ్యాలు కానీ కొన్ని పాత్రల చిత్రణ భారతదేశ కవుల రచయితలను పోలి ఉంటాయి. అంతమాత్రం చేత వారు దీనిని అనుసరించరు, అనుకరించరు. మేధావి వర్గం చెప్పే సమాధానం ప్రపంచం మొత్తం మీద ఎవరు ఎక్కడ ఏ మేధావి ఉన్నా వారి మేధస్సు ఒక రకంగానే పనిచేస్తుంది అని. షేక్స్పియర్ తనకన్నా ఎనిమిది సంవత్సరాల పెద్ద వయసులో ఉన్న అన్నేహేతవే ని వివాహమాడి మిత్రుల అవహేళనతో లండన్ కు పారిపోయాడు. రంగస్థల వేదికలపై కాలక్షేపం చేసి నిద్రాహారాలు కూడా లేకుండా బాధ పడిన వాడే. జాన్ మిల్టన్ మహాశయుడు పరిణతి చెందిన వయసులో కంటిచూపు పోగొట్టుకొని మూడో భార్య పిల్లలతో వ్రాయించిన అద్భుత కావ్యం ప్యారడైజ్ లాస్ట్ & ప్యారడైజ్ రీగైన్. కాళిదాసు లాంటి మహానుభావుడు కవికుల తిలకా అని కీర్తించబడిన వాడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఎంతమంది పరిహాసాలకు లోనయ్యాడు వారిలాగానే వేమన కూడా.
తల్లి ప్రేమకు నోచుకోక వదిన ఒడిలో పెరిగిన వాడు పరిసరాల ప్రభావంతో శారీరక సుఖాలకు అలవాటు పడి భౌతిక సుఖాలు తప్ప ఈ ప్రపంచంలో మరేదీ లేదు అని భావించిన మహానుభావుడు. కష్టపడి బాధలననుభవించిన వాడికి జీవితపరమార్థం అర్థమవుతుంది ఏం చేస్తున్నాడో తెలిసిన తర్వాత చేయవలసినది ఏమిటో ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకొని సామాజిక స్పృహతో తోటి వారికి పనికి వచ్చే అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటాడు. ఆ మార్గంలోనే నడిచిన వేమన ఆటవెలది ద్వారా సమాజానికి తాను ఏమి చెప్ప తలచుకున్నాడో దానిని అద్భుతంగా చెప్పారు. అలాంటి వాడి మీద ఎన్ని కాకమ్మ కథలు వచ్చినా, కల్పిత గాధలు వున్నా, ఎవరు ఎక్కడ చెప్పినా , మనసుకు పట్టించుకోక తన ఆశయానికి ఆదర్శంగా నిలిచిన పవిత్రమూర్తి వేమన. వారి గంటం నుంచి వచ్చిన ప్రతి పదం ఆచరణ యోగ్యమే. కష్టే ఫలి అన్నది వారి వాక్యం ఎంతో అనుభవంతో రాసినది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి