కలసి మెలసి వుందాము
కలలు పంచుకుందాము
కలతలను వీడుదము
కలహాలే మానుదము
కవితలేవో రాసేద్దాం
కయ్యాలే వదిలేద్దాం
కన్నీళ్లే తుడిచేద్దాం
కధనంలో దూకేద్దాం
కత్తులనే వదిలేద్దాం
కస్తూరినే ధరియిద్దాం
కసరత్తులు చేసేద్దాం
కర్తవ్యం పాటిద్దాం
కపటాలే మానేద్దాం
కథలేవో వినేద్దాం
కష్టాలే తీర్చేద్దాం
కరుణతో బ్రతికేద్దాం
====================
గుండాల నరేంద్రబాబు సెల్: 9493235992.ఎం.ఏ (తెలుగు సాహిత్యం).,ఎం.ఏ (చరిత్ర).,ఎం.ఏ (సంస్కృతం).,బి.ఇడి.,
తెలుగు పరిశోధకులు
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి.తేది27-05-2022
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి