ఉమ్మడి కుటుంబం;-సి.హేమలత-- లతా శ్రీ-9666779103
ఉమ్మడి కుటుంబం మమతల సమాహారం 
మనిషిని మనసున్న మనిషిగా మలచు కొలిమి
మనిషి గుర్తింపు చిహ్నం 
నడవడిని ఒడిలో నేర్పు పాఠశాల

మమతాను బంధాలు ఆధారంగా మణిహారం..
 నేడు అయినది ఆధారం లేని మణిపూస
చిన్న కుటుంబం చింత లేనిదే 
చిందరవందర చేసెను కదా మనం అను అనుబంధం..గుర్తించవా

ఘనంగా బ్రతికితే బ్రతుకు పసందు
మనం మారితే నేను గా తయారైతే 
బ్రతుకు ఒంటరై గతి తప్పితే
నీడ కరువై జీవనం భారమవుతుంది
మమత పంచు మనసులేక
 అగమ్యగోచరంగా మిగులు నీ జీవితం

అందమైన మేడ కాదు ఇల్లంటే
అమ్మ నాన్న తాతయ్య బామ్మ అత్త మామ 
పిన్ని బాబాయ్ అక్క చెల్లి అన్న తమ్ముడు 
అను పిలుపుల పులకింతల పూదోట 
ఆత్మీయత కోలాహలం ప్రతి పూట

ఉమ్మడి కుటుంబం మన సాంప్రదాయం 
ఉన్నత విలువలు నూనెగా గల దివ్వే
నువ్వు మారవంటే ఒత్తిగా
 నీ జీవితం వెలుగుజిలుగుల దీపావళి...

జాతీయ ఉమ్మడి కుటుంబ దినోత్సవ శుభాకాంక్షలు


కామెంట్‌లు
Ambikaivasapuram చెప్పారు…
Wow ma'am super💐👌