పరమేశ్వరుని ప్రతిరూపమే అది శంకరచార్యులు;-కవిమిత్ర, సాహిత్యరత్నఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్విశాఖపట్నం9963265762
శివగురు,ఆర్యమాంబల నోముపంటగా శివుని అనుగ్రహముతో వైశాఖ శుద్ధ పంచమి ఆరుద్ర నక్షత్రం లో జన్మించిన ఆదిశంకరులు సాక్షాత్తు పరమేశ్వర ప్రతిరూపమే....!!

బాల్యంలోనే పితృదేవులు పరమేశ్వరుని దరిచేరగా మాతృమూర్తి అనుగ్రహముతో సన్యసించి సనాతనధర్మమే సమాజాభివృద్దికి మార్గమని,
ముప్పదిమూడు సంవత్సరాల వయస్సులోనే తనువు చాలించినా, ప్రపంచమనుగడ ఉన్నంత వరకు వారు చెప్పిన, వ్రాసిన  అన్ని గ్రంధాలు
మానవాళి మనుగడకు ఆచరణీయం......!!

వివేకచూడామణి,మనీషాపంచకం, ప్రస్థానత్రయం, భజగోవిందశ్లోకాలు
పేద బ్రాహ్మణ స్త్రీ ని అనుగ్రహించి లక్ష్మిదేవిని    "కనకధారాస్తోత్రం" చే  స్తుతించి దారిద్ర్యవిముక్తి చేసిన మహనీయులు ఆదిశంకరాచార్య....!!

తల్లి పరదేవతా స్వరూపమే అని ఆమె దహనసంస్కారాలకు సన్యాసం అడ్డుకాదని మాతృమూర్తికి ఇచ్చిన మాటను నిలబెట్టిన సత్యవంతులు
అందుకే సాక్షాత్తు పరమేశ్వరుని ప్రతిరూపమే ఆదిశంకరాచార్య
వారికి శతకోటి వందనములు......!!
(ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా)


కామెంట్‌లు