నాలో నేను - యామిజాల జగదీశ్
నేను దాదాపు ముప్పై ఏళ్ళు మీడియాలో పని చేసినా నాకిష్టమైనవి రాయడానికి అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన వారిలో ముఖ్యులు - బుజ్జాయి మాసపత్రిక యజమాని అప్పారావుగారు, పాత్రికేయ మిత్రులు తిరునగరి వేదాంతసూరిగారు. బుజ్జయి మాసపత్రిక 2019 జూన్ నెలలో ఆగిపోయిన తర్వాత కొంత కాలానికి వేదాంతసూరిగారి చలవతో వారి "మొలక" కోసం మద్రాసుతో నాకున్న అనుబంధం గురించి ఎన్నో ఎన్నెన్నో రాశాను. అయినా ఇప్పటికీ భయమే రాస్తున్నప్పుడల్లా. ఎవరికైనా అసలు అర్థమవుతుందా అని నన్ను నేనే ప్రశ్నించుకుని కంగారుపడతాను. రాసేవి పరవాలేదా అనే సందేహం కలుగుతూనే ఉంటుంది. ఏది రాసినా భయమే....నా అరకొర సమాచారాన్ని ఆదరిస్తున్న వేదాఉతసూరిగారికి కృతజ్ఞతలు చెప్తూ ఇటీవల తమిళంలో చదివిన దానినే కొద్ది మార్పులతో ఇక్కడ రాసాను. 

విషయాని కొస్తాను....

జీవితంలో విజయం సాధించేందుకు 
ఉన్న రహస్య మార్గాలు ఏమున్నాయి అని 
గదిలో ఒక్కడిగా ఆలోచిస్తున్నప్పుడు.....

నవ్వుల ధ్వని విన్పించింది....😍 ఎక్కడినించి ఆ నవ్వొస్తోందని గది చుట్టూ చూశాను. 

 గదిలో ఉన్న వస్తువులదే ఆ నవ్వులన్నీ......🤗

అవన్నీ కలిసి "మేం చెప్పమా" అని నన్ను చూసి అడిగాయి...👍

వాటి మాటతో నాకాశ్చర్యం వేసింది.
చెప్పండి చూద్దాం అన్నాను...🤷‍♂

ముందుగా ఎయిర్ కూలర్ చెప్పింది...."బీ కూల్ Be cool" అని!

అనంతరం "పైకప్పు" చెప్పింది...
నీ ఆశయం ఎప్పుడూ ఉన్నతమై ఉండనివ్వు అని!

కిటికీ చెప్పింది... 
"ప్రపంచాన్ని చూడు" అని!

గడియారం చెప్పింది....
"ప్రతి నిముషమూ ఎంతో అమూల్యం" అని!

అద్దం చెప్పింది....
"ఓ పని చేసే ముందర నిన్ను నువ్వు చూసుకో. ఆలోచించుకో" అని!

క్యాలండర్ చెప్పింది....
"ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు అప్డేట్ update చేసుకో" అని!

 తలుపు చెప్పింది....
"నీ లక్ష్యసాధనల తలుపు తెరచి గట్టిగా ముందడుగు వేయి" అని!

నేల చెప్పింది....
"మోకాళ్ళపై ఉండి ప్రార్థించు" అని!

చెత్తబుట్ట చెప్పింది...
"వ్యర్థాలను పడేసే...నీలోని దుర్గుణాలను మానుకో" అని!

టేబుల్ మీదున్న భగవద్గీత చెప్పింది....
"సన్మార్గంలో నడిచేందుకు నన్ను చదవడం మానకు" అని!

వాటి సూచనలన్నీ వింటుంటే ఆశ్చర్యం వేసింది.

మన చుట్టూ ఉన్నవేవీ తక్కువకాదనిపించింది. 
ప్రతి దాని నుంచీ నేర్చుకోవలసింది ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందనిపించింది. నిజమే కదూ, మనం చూడాలి! వినాలి!  గమనించాలి. ఆచితూచి అడుగేయాలి....!!🤘

కానీ 
మనం అర్థం చేసుకోక 
తొందరపాటుతోనో
నిర్లక్ష్యంతోనో 
తప్పటడుగులు వేసి
పడరాని పాట్లు పడి 
అందుకు 
ఎవరెవరినో 
ఏవేవో మాటలంటాం....🎈

ఆలోచించి చూడగా 
మన తీరెంత తప్పో అన్పిస్తుంది.

అందుకే 
చైతన్యంతో ఉండాలి. ...🎊
విజయం సాధించాలి..👍


కామెంట్‌లు