వికలాంగుడు!!;- సునీత ప్రతాప్
నాకు కాళ్లు లేవు కానీ
కలలు కనే కళ్ళు ఉన్నాయి
కలల లోకంలో నడవగలను
పరుగెత్త గలను
ప్రపంచమంతా చుట్టి రాగలను

నాకు చూపు లేదు
మా అమ్మని నేను చూడలేదు
కానీ కలలు కనే శక్తి ఉంది
మా అమ్మ ఎంతఅందంగా ఉందో
ప్రకృతి అంత అందంగా ఉంది
ఎంతో అందమైనది ఈ ప్రపంచం

అమ్మ నాకు
కలలుగనే మనసిచ్చింది
దుఃఖాన్ని దిగమింగి శక్తినిచ్చింది
అమ్మనాకు
సంతోషించే సగం బలం ఇచ్చింది

నేను  అంగవైకల్యున్నే
కానీ మానసిక వికలాంగుని కాదు!!

 Sunithaprathap teacher
Palem, Nagar kurnool (dist)

కామెంట్‌లు