సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 దారం.. ఆధారం
******
దారం కేవలం పడుగు పేకల నేతలో కలిసి వస్త్రమై మన దేహాన్ని చుట్టుకోవడమో,పూల మాలలో చేరి సమైక్యతకు తోడ్పడటమో కాదు.
సంస్కృతి సాంప్రదాయాల జీవితంలో దారానికి చాలా ప్రాముఖ్యత ఉంది.
మూడు ముళ్ల బంధానికి, ముచ్చటైన స్నేహానికి, అన్నా చెల్లెళ్ళ రక్షాబంధనంలో,పండుగలు ,పూజల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో చేతులకు కట్టుకునే కంకణాల్లోనూ కుల మతాలకు అతీతంగా దాగి ఉన్న దారమే ఆధారం.
 దారానికి మనసుల్ని, మనుషుల్ని కలిపే గొప్ప గుణం ఉంది.
మనం కూడా  భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించేలా పూల దండలో దారంలా ఉందాం .
మంచితనం, సాయపడే  తత్వం, ఆదర్శపు ఆలోచనలు నచ్చని వాళ్ళు మన చుట్టూ కొందరు ఉంటారు.
దారంలాంటి కలుపుకుని పోయే మనసును మాటల కత్తెరతో కటుక్కున కత్తిరించి చివుక్కుమనిపిస్తారు.అలాంటి వారికి సాధ్యమైనంత దూరంగా ఉందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు