కవిత్వం రాస్తావా
రాసేయ్ ...
అడ్డులేదు ...!
రాసేముందు
కాగితం మీద
కలం...
పెట్టేముందు ,
ఒక్కసారిఆలోచించు
నీ మస్తిష్క--
భాండాగారంలో
తెలుఁగు పదాల
ఆస్తి ఎంత ...?
నీకుతెలుసా
అది డబ్బిచ్చి -
కొనేదికానేకాదు
పుస్తకాలు -
చదివితేనే వచ్చేది !
కవిత్వం
చదవకుండా
రాసేప్రయత్నం
చెయ్యకు .....!
అక్షరదోషాలతో
కవిత్వం రాసి
గ్రూపుల్లో-
అర్జంటుగా
పోష్ట్ చెయ్యబోకు!
చేసినా.....
ఎవరైనా
సరిజెయ్యబోతే
చిన్నబుచ్చుకోకు!
వందకవితలుచదివి
ఒక కవితరాసే
ప్రయత్నంచేయ్
నీకవిత్వంలోచిక్కధనం
నీకేతెలుస్తున్దప్పుడు!
అందుకే----
మున్దు చదవడం
మొదలుపెట్టు...
ఆపైన....
కాగితంమీద
కలం పెట్టు....!
ఇదినిజం నువ్వు
కవివి కావడం...
అవును---
శ్రీ.శ్రీ.మీద ఒట్టు...!!
***
కవివైపో ...!!;- డా.కె.ఎల్.వి.ప్రసాద్హన్మకొండ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి