ఆ కొనగోటి స్పర్శకు.....పులకించిన చిత్రకళ....ఎన్నెన్నో అందాల....ఆకృతులనుదాల్చుతుంది!అజంతా శిల్పాల, ఖజురహో చిత్రాల...వడ్డాదిసొంపుల,బాపువంపుల,ప్రకృతిసోయగాల...అద్భుతమీ నఖసృష్టి !పరవసింప జేయునీరసపుష్టి! పులకించి పోవుకదా వీక్షించిన హృది !!ఆతని అస్త్రము, శస్త్రము,ఉలి యూ,సుత్తియు...ఉపకరణములన్నియు నఖమే...ఎందరెందరో ప్రముఖుల ప్రశంసలనుతెచ్చింది...ఎన్నెన్నోసన్మాన సత్కారములను ఇచ్చింది!పల్ల పరిసినాయుని నఖము పుణ్యమెంత జేసెనో... !ధన్యమాయెను కదా ఆతని జన్మము!!*******
* నఖ సృష్టికి నమోన్నమః *;- కోరాడ నరసింహా రావు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి