అనుకోని వర్షాలు ;-ఎం. వి. ఉమాదేవి
ఆట వెలది 

మండుటెండలోన మరిమరి సిరివాన
చల్లదనముతోడ నుల్లసిల్ల
సేదదీరిరిపుడు సెగలేని విధమునన్ 
కూలినాలి జనము కుమిలిపోయె !

పంటచేలు దడిచి పాపము రైతన్న 
నష్టపోయె నిపుడు నల్విధముల
యేటికేడు సాగు యేనాటి ఋణములు 
తీరుమార్గమేది తిన్నగాను !!

కామెంట్‌లు