నవ్వేశా (బాలగేయం);- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 టపట చినుకులు రాలుతుండగా 
జలజల నీరు పారుతుండగా 
చకచక నడకలు నడిచేసి 
పరపర కాగితాలు చించేసి 
బిరబిర పడవలు చేసేసి 
చరచర పడవలు విడిచేసి 
పకపక నవ్వులు నవ్వేసి 
మలమల కడుపు మాడినాసరే 
పడవ పందాలు సాగించాం 
పందెం నేనే గెలిచేశా 
ఆనందంగా నవ్వేశా!!

కామెంట్‌లు