అయిదో ఏట
వేళ్ళను లెక్కించాడు
పదో ఏట
అంకెలను లెక్కించాడు
పదిహేనో ఏట
మార్కులను లెక్కించాడు
ఇరవయ్యో ఏట
పరీక్షలను లెక్కించాడు
ఇరవై అయిదో ఏట
జీతాన్ని లెక్కించాడు
ముప్పయ్యో ఏట
మిత్రులను లెక్కించాడు
ముప్పై అయిదో ఏట
వారసులను లెక్కించాడు
నలభయ్యో ఏట
అప్పులను లెక్కించాడు
నలబై అయిదో ఏట
జబ్బులను లెక్కించాడు
యాబయ్యో ఏట
బంధువులను లెక్కించాడు
యాభై అయిదో ఏట
మాత్రలను లెక్కించాడు
అరవయ్యో ఏట
మనవళ్ళను లెక్కించాడు
అనంతరం
వయస్సును లెక్కించాడు
మరణించిన తర్వాత
తనకోసం
కన్నీళ్ళు పెట్టకునే మనసులను
లెక్కించాడు
ఆలోచించి చూడగా
తన వెంట
కడదాకా పయనించింది
గణితం మాత్రమే అని
అనుకున్నాడు !!
చదివాను తమిళంలో
బాగుందనిపించి రాసానిక్కడ!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి