విభీషణుడు.పురాణ బేతాళ కథ. డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించి ఉన్నబేతాళుని బంధించి భుజంపైనచేర్చుకుని నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు ' మహరాజా నీ పట్టుదలమెచ్చదగినదే నాకు విభీషణుడు గురించి తెలియజేయి. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు' అన్నాడు.
' బేతాళా విభీషణుడు హిందూ పవిత్ర గ్రంథమైన రామాయణంలో ఒక ముఖ్య పాత్ర. రావణాసురునికి తమ్ముడు. విశ్రవసు కైకసియందు పుట్టిన మూడవ కుమారుడు. సీతను రావణాసురుడు అపహరించిన తర్వాత ఆమెను మళ్ళీ రామునికి అప్పగించమని అన్న రావణునికి పలు విధాల చెప్పిచూశాడు. రావణుడు అతని సలహాను పాటించకపోగా అవమానిస్తాడు. విభీషణుడు వెళ్ళి రాముని శరణు వేడుతాడు. రామ రావణ యుద్ధంలో రాముడికి రావణుడి ఆయువు పట్టు చెప్పి అన్న మరణానికి కారణం అయ్యాడు. రావణుడి తర్వాత లంకా సామ్రాజ్యానికి రాజు అయ్యాడు. ఈయన చిరంజీవి.
శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయ పురాణంలో విభీషణుడి ప్రస్తావన ఉంది.ఈ పురాణం ప్రకారం శ్రీరాముని పట్టాభిషేక సమయంలో అక్కడికి వచ్చిన విభీషణుడికి విమాన విగ్రహం లభిస్తుంది. దాన్ని తీసుకుని తన లంకా సామ్రాజ్యంలో ప్రతిష్టించుకోవాలనుకుంటాడు. దారి మధ్యలో విశ్రాంతి కోసం ఆ విగ్రహాన్ని కావేరి నది గట్టున ఉంచి పూజలు నిర్వహిస్తాడు. కానీ దాన్ని లేపి తీసుకెళ్ళడానికి సాధ్యపడదు. అప్పుడు మహావిష్ణువు విభీషణుడికి కలలో కనబడి తాను ఆ ప్రదేశంలోనే కొలువై ఉంటానని చెప్పాడు. అప్పటి నుంచి ఆ ప్రదేశం శ్రీరంగం గా వ్యవహరించబడుతోంద'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభగంకావడంతో, శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.పట్టువదలనివిక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.


కామెంట్‌లు