ఎన్నిక! అచ్యుతుని రాజ్యశ్రీ

 విక్రమశిల మహారాజు కి కొత్త మంత్రి ని  నియమించటం ఒక సమస్యగా మారింది.ఇప్పుడు ఉన్న మంత్రి వృద్ధుడై సరైన సమయం లో సహరించలేకపోతున్నాడు.రాజగురువు సలహా అడిగాడు. "రాజా!ఈసారి  ఇద్దరువ్యక్తుల ను ఎన్నుకుని మంత్రులు గా నియమించు"అన్నాడు. "నీకు 
ఐదుప్రశ్నలు రాసిఇస్తాను.ఐదురోజుల్లో జవాబు చెప్పాలి.అలాచెప్పలేని వారికి కఠిన శిక్ష అని చాటించు.అప్పుడు తెలివి ధైర్యం ఉన్న వాడు ముందుకు వస్తాడు." అలాగే రాజు చాటింపు వేయించాడు.ఎవరూ ముందుకు రావటంలేదు.రాజు ఖంగారు పడసాగాడు.
 ఐదోరోజు ఓసాదాసీదా వ్యక్తి  సభలోకి ప్రవేశించి "ప్రభూ! మీప్రశ్నలకి నేను సిద్ధం"అన్నాడు. అమాయకంగా ముతకదుస్తుల్లో ఉన్న అతన్ని చూస్తూనే రాజు నిరాశపడ్డాడు.కానీ ప్రశ్నలుఅడగసాగాడు"మేకపొట్టలోని పెంటికలు ఎందుకు గుండ్రంగా ఉంటాయి?"  అతను సూటిగా అన్నాడు "వాయువు వల్ల "."రావిఆకు ఈనె లోపలివైపా బైట వైపా పెద్దదిగా ఉంటుంది?" అతని జవాబు " రెండు వైపుల సమానంగానే ఉంటుంది రాజా!" "నామూడో ప్రశ్న విను- ఉడతశరీరంపై ఎన్ని  తెల్లని నల్లని చారలుఉంటాయి?దాని శరీరం తోకలో ఏది పొడవు ఎక్కువ?" అతను ఇలా జవాబు ఇచ్చాడు " ఇందులో రెండు ప్రశ్నలు ఉన్నాయి ప్రభూ! ఇవి చెప్పితే నాలుగు జవాబులు  చెప్పినట్లు లెక్క! నలుపు తెలుపు చారలు సమానం.దాని శరీరం తోక సమంగా ఉంటాయి" రాజు  అన్నాడు "ఇది నాఆఖరు ప్రశ్న.రాజుకి ఎంతమంది తండ్రులు ఉంటారు?" ఆవ్యక్తి తడుముకోకుండా అన్నాడు " ప్రభూ!రాజుకి ఐదుగురు  తండ్రులు. తనకు  జన్మనిచ్చిన రాజు కన్నతండ్రి.కుబేరుడు తండ్రి. ధనవంతుడు  భూమీశుడు కాబట్టి  కుబేరుడు కూడా తండ్రికింద లెక్క. క్రూరత్వంలో చండాలుడు. కాబట్టి చండాలుడు కూడా రాజుకి తండ్రియే! ఇకప్రజలే అతని సొత్తు !అవసరమైతే వారి సంపదను కూడా ఎంచక్కా అధికారం చెలాయించి గుంజుకుంటాడు కాబట్టి దొంగ కూడా అతనికి  తండ్రియే! నిద్రపోయే వాడిని బలవంతంగా కొరడాఝళిపించిఐనా లేపుతాడు కాబట్టి  తేలు కూడా రాజు కి తండ్రి తో సమానం! అంటే రాజు కి రాజు  కుబేరుడు  చండాలుడు దొంగ  తేలు అనే ఐదుగురు తండ్రులు ప్రభూ!" అని ధైర్యం గా ఆత్మవిశ్వాసం తో ఉన్న  అతన్ని మనసులోనే మెచ్చుకున్నారు సభికులంతా! అతనికి మంత్రిపదవిని వెంటనే కట్టబెట్టాడు రాజు. పైపై ఆడం బరాలు దుస్తులు నగలతో మనిషి వ్యక్తిత్వం తెలివితేటలు కొలవరాదు.సమయసందర్భోచితంగా నేర్పుగా జవాబు చెప్పే నైపుణ్యం కావాలిసుమా🌹
కామెంట్‌లు