జీవితం;-ప్రియాంక ఓరుగంటి
ఒకరిని ప్రేమించడం
ఒకరిని ద్వేషించడం
వ్యక్తిగత అభిప్రాయం
ఎవరినీ చులకన చేయరాదు
అది వారి ధర్మం కాదు
హక్కు అంతకన్నా కాదు!!?

నచ్చితే వదులుకోకు
వదులుకుంటే తిరిగి చూడకు
ఉన్నదాన్ని పోగొట్టుకోకు
పోగొట్టుకుంటే తిరిగి రాదు!!?
మనుషుల్లో మానవత్వం లేదు
గుండెల్లో ప్రేమ లేదు
మానవత్వం ప్రేమ ఎలా వెతుక్కోవాలి
అది ముందు తరాలకు కనిపించదేమో!!?

ఒకరికోసం చూడకు
వారు నీకు ఏమీ చేయరు
గుండెల్లో బాధ
కళ్ళల్లో కన్నీరు తప్ప హ
ఏమీ లేనిదీ ఈ జీవితం!!?

Dedicated to my mother Manjula my father Prakash Sharma 🙏❤️🙏

కామెంట్‌లు