అమ్మల్లే మమ్మల్ని తన కమ్మన్ని
మాటల్తో లాలించే బడి అంటే మాకిష్టం!
తోటల్లో పూవుల్లా హాయి గాలుల్లో
తేలించి కేళించే బడి అంటే మాకిష్టం!
ఆటల్తో పాటల్తో మరి మాటల్తో
చదివించి చూపించే బడి అంటే మాకిష్టం!
కొట్టన్ని తిట్టన్ని మరి మొట్టన్ని
చక్కన్ని చదువిచ్చే బడి అంటే మాకిష్టం!
అబ్బయ్యో దెబ్బయ్యే తన జబ్బేమో
అని తలచే అబ్బో! ఆ బడి అంటే మాకిష్టం!
రాగంలో తాళంలా మరి పాటల్లో మాటల్లా
అనిపించే క్రమశిక్షణనిచ్చే బడి అంటే మరీమరీ ఇష్టం!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి